అత్యాచారాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి-నిందితులను కఠినంగా శిక్షించాలి

 

-ఐద్వా సంఘం జిల్లా అధ్యక్షురాలు కందునూరి కవిత

మహబూబాబాద్ బ్యూరో-ఆగస్ట్24(జనంసాక్షి)

మహిళపై అత్యాచారాలు జరగకుండా ప్రభుత్వమే బాధ్యత వహించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళ సంఘం మహబూబాద్ జిల్లా అధ్యక్షురాలు కందునూరి కవిత అన్నారు.మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని నల్లగుట్ట తండ శివారులోని గ్యామ తండా గ్రామానికి చెందిన ఓ పన్నెండేళ్ళ మైనర్ బాలికపై అత్యాచార ఘటన చోటు చేసుకున్న గ్రామాన్ని సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు దాడులు అనేక రకాలైన అవమానాలను చేస్తున్నప్పటికీ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోవడంలేదని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలాంటి ఘటనలకు పాల్పడ్డ వారిపై కఠినమైన చర్యలు, కఠినమైన చట్టాలు, అవగాహనలు చేసే విధానంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆమె అన్నారు. వారికి ఎన్నో రకాల సెక్షన్స్ పెట్టి నియమ నిబంధనలు కఠినంగా ఉండేటట్లుగా అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. విద్యార్థుల పట్ల ప్రభుత్వం ప్రత్యేక నిఘాలు ఏర్పాటు చేయాలన్నారు. ఆయా ప్రాంతాలలో వాటిపై అవగాహన కార్యక్రమం నిర్వహించేందుకు ప్రత్యేకమైన చట్టం తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి పెరుమాండ్ల తిలక్ బాబు, కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఈసంపల్లి సైదులు, ఉప సర్పంచ్ కన్నయ్య, వెంకన్న, మహిళలు తదితరులు పాల్గొన్నారు.