అదానీ కుంభకోణంలో మౌనమేళ మోదీ!

` బీజేపీతో భారాస కుమ్మక్కు..
` అందుకే మాట్లాడటంలేదు: సీఎం రేవంత్‌
` దేశాన్ని అప్పులకుప్పగా మార్చి సంపదను మిత్రులకు పంచిన మోదీ
` దేశానికి రూ.183 లక్షల కోట్ల అప్పులు చేసి పెట్టారు.
` పరివారాన్ని కాపాడుకునే పనిలోనే ప్రధాని
` ఈడీ కార్యాలయం ఎదుట ధర్నాలో ముఖ్యమంత్రి ధ్వజం
` సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహం పెడతామని వెల్లడి
హైదరాబాద్‌(జనంసాక్షి):అదానీ వ్యవహారాన్ని చట్టసభల్లో రాహుల్‌ గాంధీ బయటపెట్టారని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. కేంద్ర దర్యాప్తు సంస్థల్ని తమ గుప్పిట్లో పెట్టుకుని కొందరికే లబ్ది చేకూరేలా వ్యవహరిస్తున్న ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా విధానాలకు నిరసనగా దేశంలోని అన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కార్యాలయాల ఎదుట కాంగ్రెస్‌ పార్టీ గురువారం ఆందోళనలు నిర్వహించింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయం వద్ద చేపట్టిన ధర్నాలో సీఎం పాల్గొని మాట్లాడారు. ‘దేశానికి రూ.183 లక్షల కోట్ల అప్పులున్నాయి. 16 మంది ప్రధానులు చేసిన అప్పుల కంటే నరేంద్ర మోదీ రెండిరతలు ఎక్కువ చేశారు. మోదీ తన పరివారాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. దేశాన్ని మోదీ, అమిత్‌షా, అదానీ, అంబానీ చెరబట్టారు. సెబీ ఛైర్‌పర్సన్‌ అక్రమాలపై విచారణ జరపాలి. వర్సిటీలు, ప్రాజెక్టులను మొదలుపెట్టిన దార్శనిక ప్రధాని నెహ్రూ. ఇందిరా గాంధీ భూసంస్కరణలు ప్రవేశపెట్టి బలహీనవర్గాలకు భూములు పంచారు. రాజీవ్‌గాంధీ తెచ్చిన సాంకేతిక విప్లవం వల్లే ఐటీ అభివృద్ధి సాధ్యమైంది. ఇప్పుడు రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఉందని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఎడ్యుకేషన్‌, ఇరిగేషన్‌ మా ప్రయారిటీ అని నెహ్రు పరిపాలన సాగించారని, బ్యాంకులను రైతుల కోసం ఇందిరాగాంధీ జాతీయం చేశారని అన్నారు. పేదలకు భూములు ఇచ్చి ఇందిరాగాంధీ ఆత్మగౌరవం పెంచారని, సాంకేతిక రంగాన్ని పెంచి పోషించారు రాజీవ్‌ గాంధీ అని రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. సాంకేతిక విప్లవం తెచ్చారు రాజీవ్‌ గాంధీ అని, పీవీ లాంటి ప్రధానులు దేశం కోసం ప్రణాళికలు రచించి దేశాన్ని ముందుకు నడిపించారన్నారు. స్వతంత్ర పోరాటం కోసం గుజరాత్‌ నుండి గాంధీ.. వల్లభాయ్‌ పటేల్‌ బయలుదేరారని, అదే గుజరాత్‌ నుండి.. మోడీ.. అమిత్‌ షా లు బయలు దేరారని, ఆ ఇద్దరినీ చూస్తే దేశం గర్విస్తుంది? ఈ ఇద్దరు దేశం సంపద లూటీ చేస్తున్నారన్నారు. అంతేకాకుండా..’బీఆర్‌ఎస్‌ సన్నాసులు ఈ విషయంలో బీజేపీ నీ ఎందుకు నిలదీయడం లేదన్నారు. . బీజేపీలో బీఆర్‌ఎస్‌ విలీనం అవుతుందో.. మలినం అవుతుందో వాళ్ళ ఇష్టం. కేసీఆర్‌ ఎందుకు బీజేపీ దోపిడీ విూద ఎందుకు స్పందించడం లేదు. ట్విట్టర్‌ టిల్లు ఎందుకు మాట్లాడరు. బీజేపీకి అనుకూలం కాబట్టే ఆయన స్పందించరు. జేసీసీ విషయంలో బీఆర్‌ఎస్‌ విధానం ఏంటి..? అమిత్‌ షా.. మోడీని మెప్పించడానికి రాజీవ్‌ గాంధీ విగ్రహం తీసేస్త అంటున్నారు. ఎయిర్‌ పోర్ట్‌ కి రాజీవ్‌ గాంధీ పేరు మారుస్తాం అంటున్నారు. చెయ్‌ వేసి చూడు.. వీపు పగలకొట్టక పోతే పేరు మార్చుకుంట. తెలంగాణకి తల్లి సోనియా గాంధీ. సచివాలయం బయట కాదు.. లోపల తెలంగాణ తల్లి విగ్రహం పెడతాం. పదేళ్లు ఈ సన్నాసులు ఎందుకు పెట్టలేదు తెలంగాణ తల్లి విగ్రహం.
మోడీ తీరుతో ఆదానీ ఆస్తులు రెట్టింపు
హైదరాబాద్‌ నగరంలోని ఈడీ ఆఫీసు వద్ద కాంగ్రెస్‌ చేపట్టిన ధర్నా విజయవంతమయ్యింది. ఈ కార్యక్రమానికి సీడబ్ల్యూసీ మెంబర్‌ సల్మాన్‌ కుర్షిద్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ… ప్రధాని మోడీ నల్లధనం తెస్తానని.. పేదల ఖాతాలో పదిహేను లక్షలు వేస్తానని 15 పైసలు కూడా వేయలేదని విమర్శించారు. అదానీని మాత్రం ప్రపంచంలోనే ధనవంతులు జాబితాలో మోడీ చేర్చారన్నారు. రాహుల్‌ గాంధీ ప్రధాని కావడమే లక్ష్యంగా పనిచేద్దాం లేదంటే మోడీ ఈ దేశాన్ని నలుగురి చేతిలో పెట్టి నాశనం చేస్తారంటూ వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ ఒకటయ్యాయని.. లేదంటే 14 ఎంపీ సీట్లను కాంగ్రెస్‌ గెలిచేదని పేర్కొన్నారు. మోడీని ఎవరు వ్యతిరేకిస్తే వాళ్లపై ఈడి దాడులు జరుగుతున్నాయని.. కానీ ఆదాని అక్రమాస్తులపై ఎందుకు విచారణ జరగడం లేదని ప్రశ్నించారు. సెబీ చైర్మన్‌ను వెంటనే విధుల నుంచి తప్పించాలని మరో మంత్రి శ్రీధర్‌ బాబు డిమాండ్‌ చేశారు. అదానీ ఆస్తులు అక్రమంగా పెంచడంపై న్యాయవిచారణ జరగాలన్నారు. అదానీ వ్యవహారంపై జేపీసీతో విచారణ జరిపించాలని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. రో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం దొంగ చాటున అదానీ గ్రూపును కాపాడుతుందన్నారు.సెబి చైర్మన్‌ కుటుంబసభ్యులకు అదాని గ్రూపులో వాటాలు ఉన్నాయని.. అలాంటి వారితోనే న్యాయ విచారణనకు ఆదేశిస్తే వాస్తవాలు ఎలా బయటకు వస్తాయని ప్రశ్నించారు. రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేసినట్టు జేపీసీ వేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.తెలంగాణలో టీఆర్‌ఎస్‌ లేదు.. అది ఎప్పుడో బీజేపీలో కలిసిపోయిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈడి ఆఫీస్‌ ముందు టీపీసీసీ ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపట్టారు. గన్‌ పార్క్‌ నుండి ఈడీ ఆఫీస్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఏఐసీసీ ఇంచార్జ్‌ దీపా దాస్‌ ముంన్షి, మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, సీతక్క, శ్రీధర్‌ బాబు, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, జూపల్లి కృష్ణారావు, ఎంపీలు, ఎమ్మెల్సీ లు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం కోమటి రెడ్డి మాట్లాడుతూ.. ఆదాని మెగా కుంభకోణం పై విచారణ జరపాలన్నారు. సెబీ చైర్మన్‌ అక్రమాలపై జేపీసీ వేయాలని, సెబీ చైర్మన్‌ రాజీనామా చేయాలని తెలిపారు. దోషులకు చట్టపరంగా శిక్షించాలనే డిమాండ్లతో ఈ ఆందోళన చేపట్టామన్నారు. మోడీ నల్లధనం తెస్తానని.. పేదల ఖాతాలో పదిహేను లక్షలు వేస్తానని 15 పైసలు కూడా వేయలేదన్నారు. అదానీ మాత్రం ప్రపంచంలోనే ధనవంతులు జాబితాలో చేర్చాడు మోడీ అని మండిపడ్డారు. రాహుల్‌ గాంధీ ప్రధాని కావడమే లక్ష్యంగా పనిచేద్దాం.. లేదంటే మోడీ ఈ దేశాన్ని నలుగురి చేతిలో పెట్టి నాశనం చేస్తారన్నారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ ఒకటయ్యాయన్నారు. లేదంటే 14 ఎంపీ సీట్లు కాంగ్రెస్‌ గెలిచేదన్నారు. తెలంగాణలో టిఆర్‌ఎస్‌ లేదన్నారు. అది ఎప్పుడో బీజేపీలో కలిసిపోయిందన్నారు. మన పోరాటం బీజేపీ తోటే అన్నారు. మరోవైపు మంత్రి శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ.. సెబీ చైర్మన్‌ ని వెంటనే విధుల నుంచి తప్పించాలన్నారు. అదానీ ఆస్తులు అక్రమంగా పెంచడంపై న్యాయవిచారణ జరగాలన్నారు. అదానీ వ్యవహారంపై జేపీసీ తో విచారణ జరిపించాలన్నారు. మోడీని ఎవరు వ్యతిరేకిస్తే వాళ్లపై ఈడి దాడులు జరుగుతున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. కానీ ఆదాని అక్రమాస్తులపై ఎందుకు విచారణ జరగడం లేదన్నారు.

నామినేటెడ్‌ పదవుల వ్యవహారం కొలిక్కి!
` సీఎం, మంత్రుల దిల్లీ పర్యటన
హైదరాబాద్‌(జనంసాక్షి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం రాత్రి గంటలకు ఢల్లీికి వెళ్లారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి దీపాదాస్‌ మున్షీ కూడా వెళ్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. దిల్లీలోని పార్టీ పెద్దలతో సమావేశమై.. పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్‌ పదవుల భర్తీ తదితర అంశాలపై చర్చించే అవకాశమున్నట్టు సమాచారం.ఆ తర్వాత రాజీవ్‌గాంధీ విగ్రహావిష్కరణకు సోనియా గాంధీ, రాహుల్‌, ప్రియాంకలను ఆహ్వానిస్తారు. రూ.2లక్షల రుణమాఫీ చేసిన సందర్భంగా వరంగల్‌లో నిర్వహించ తలపెట్టిన కృతజ్ఞత సభకు రాహుల్‌గాంధీని ఆహ్వానించనున్నారు. తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యుడిగా అభిషేక్‌ మను సింఫ్వీు ఏకగ్రీవ ఎంపిక తదితర అంశాలపై పెద్దలతో చర్చించనున్నారు. రాష్ట్రంలో గడిచిన ఎనిమిది నెలల కాంగ్రెస్‌ ప్రభుత్వంలో అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, ఆరు గ్యారంటీల అమలు తదితర అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో గడిచిన ఎనిమిది నెలల కాంగ్రెస్‌ ప్రభుత్వంలో అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, ఆరు గ్యారంటీల అమలు తదితర అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.