అదిరే ఆటకు అంతా సిద్దం మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్‌

ప్రేక్షకులను అలరించడానికి ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతాయని ఎదురు చూస్తున్న ఐపీఎల్‌ మ్యాచ్‌లు నేటి సాయంత్రం ప్రారంభం కానున్నాయి. ఈ మ్యాచ్‌లకు సాధారణంగా ఎక్కువ క్రేజ్‌ ఉంటుంది. రెండు ప్రాంచైజలీల మద్యసాగే ఈ మ్యాచ్‌లు నెల రోజుల పాటు క్రికేట్‌ ప్రేక్షకులను ఉర్రూతలూగించనున్నాయి. ఏకపక్ష మ్యాచ్‌లతో ఆసక్తి సన్నగిల్లిన స్థితిలో క్రికెట్‌ ప్రెక్షకుల దృష్టి ఇప్పుడు ఐపీఎల్‌ పైనే . మెరుపు షాట్లకు ,ఉత్కంట పోరాటాలకు ,మెరుపు విన్యాసాలకు, రికార్డులకు వేదికైనా ఈ మ్యాచ్‌లంటే ఎవరికైనా ఆసక్తి ఉంటుంది. వినోదానికి వంద శాతం గ్యారెంటి ఇవ్వడానికి నేటి సాయంత్రం మొదలు కానున్నాయి.క్రికెట్‌ ప్రేక్షకులకు ఇక 54రోజుల పాటు సందడే సందడి.
ఏ ఏటికాయేడు కొత్తగా కనిపించడం ప్రత్యేకత. అంటే ఇసారి ఒక జట్టుకు ఆడిన ఆటగాడు ఇంకోసారి మరోజట్టుకు ఆడుతాడు. ఒక్కో జట్టు ప్రదర్శన ఒక్కో ఏడు ఒక్కోరకంగా ఉంటుంది.
ఏ జట్టయినా టైటిల్‌ నెగ్గచ్చు
ఐపీఎల్‌ మ్యాచ్‌లో కచ్చితంగా ఈ జట్టే గెలుస్తుందని చెప్పడం కష్టం. టైటిల్‌ గెలవడానికి ప్రతి జట్టు బరిలో దిగుతుంది. అందుకు తగ్గట్టుగానే కసరత్తులు ముమ్మరంగా చేస్తున్నాయి. మొత్తానికి ఈ మ్యాచ్‌లు 54 రోజుల పాటు ప్రేక్షకులను అలరించనున్నాయి.