అది ‘ చీ ‘ కృష్ణ కమిటీ !
కేంద్రం చెబితేనే ఆష్షన్లతో కూడిన నివేదిక ఇచ్చిందట!
నిర్లజ్జగా శ్రీకృష్ణ ప్రకటన
హైదరాబాద్, అక్టోబర్ 4 (జనంసాక్షి) : 2009 డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా వెలువడ్డ ప్రకటన వెనక్కి వెళ్లిన తర్వాత మళ్లీ ఉద్యమం ఊపందుకున్న సంగతి తెలిసిందే. ఆ ఉద్రిక్త సమయంలో పాలకులు వేసిన కుటిల ఎత్తుగడ ‘శ్రీ కృష్ణ కమిటీ’ నియామకం. ఈ కమిటీ తెలంగాణలో పర్యటిస్తుందని, తెలంగాణ ప్రజల మనోభావాలను కేంద్రానికి నివేదిస్తుందని, ఆ నివేదిక ఆధారంగానే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటారని పాలకులు చెప్పుకొచ్చారు. కానీ, మాజీ జస్టిస్ శ్రీ కృష్ణ ఆధ్వర్యంలో తెలంగాణలో పర్యటించిన ఈ కమిటీ కేంద్రానికి సమర్పించిన నివేదికను చూసి నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజానీకం నివ్వెర పోయింది. కమిటీ సభ్యులకు తమ అభిప్రాయాన్ని వెల్లడించిన వారైతే, ఆ నివేదిక సారాంశాన్ని జీర్ణించుకోలేక పోయారు. ఈ కమిటీ అంతా బూటకమని తెలంగాణవాదులు మిగతా 3వ పేజీలో