అదుపుతప్పి ఆటో బోల్త డ్రైవర్ మృతి

 

చింతలమానేపల్లి, సెప్టెంబర్ 12,
(జనంసాక్షి) :
చింతలమనేపల్లి – బాలాజీ అనుకోడ ప్రధాన రహదారిపై సోమవారం అదుపు తప్పి ఆటో బోల్తా పడింది.ఏస్ ఐ గుంపుల విజయ్ తెలిపిన వివరాల ప్రకారం సిర్పూర్( టి )మండలకేంద్రానికి చెందిన హైమద్ ఖాన్ 45 కిరాయి నిమిత్తం బేజ్జుర్ మండలంలోని మర్ధిడి గ్రామానికి వెళ్లి తిరుగు వస్తున్న క్రమంలో బాలాజీ అనుకోడ రైతు వేదిక వద్ద ఆటో అదుపుతప్ప పాల్టీలు కొడుతూ పంట పొల్లాలోకి దూసుకు వెళ్ళింది, స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని తీవ్ర గాయాలు పాలైన డ్రైవర్ ను సిర్పూర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతు మృతిచెందాడు. మృతుడికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు.