అధికారం కోసం కాంగ్రెస్‌  కుట్రలు


` తల్లి చేతిలో బిడ్డలెక్క కేసీఆర్‌ చేతిలో తెలంగాణ భద్రంగా ఉంటది:మంత్రి హరీశ్‌ రావు
సిద్దిపేట(జనంసాక్షి): అబద్ధాలతో అధికారంలోకి రావాలాని కాంగ్రెస్‌ కుట్రలు చేస్తుస్నది. చంటి పిల్ల కన్న తల్లి చేతుల్లో ఎంత క్షేమంగా ఉంటుందో కేసీఆర్‌చేతుల్లో తెలంగాణ అంత సురక్షితంగా ఉంటుందని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. శుక్రవారం కాంగ్రెస్‌ బ్లాక్‌ ప్రెసిడెంట్‌ ముశినం శ్రీనివాస్‌ (మాంగోలు ), కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకుడు జంగిటి శ్రీనివాస్‌ ముదిరాజ్‌, ఎన్‌ఎస్‌యూఐ సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు శ్రావణ్‌ తదితరులు మంత్రి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ..కాంగ్రెస్‌ పార్టీకి రాష్ట్ర ప్రజల విూద ప్రేమ తక్కువ..అధికారం విూద యావ ఎక్కువ అని విమర్శించారు. అబద్ధాలతో అధికారంలోకి రావాలనుకుంటున్న కాంగ్రెస్‌తో జాగ్రత్తగా ఉండాలన్నారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో పదికి పది మనమే గెలవ బోతున్నామని స్పష్టం చేశారు. కర్ణాటక ఉపముఖ్యమంత్రి తెలంగాణకు వచ్చి మేము ఐదు గంటలు కరెంట్‌ ఇస్తున్నాం అన్నాడు. మన రాష్ట్రంలో గత 8 ఏళ్లుగా వ్యవసాయానికి ఇబ్బంది లేకుండా కరెంట్‌ ఇస్తున్నాం.రైతుబంధు సృష్టి కర్త మన కేసీఆర్‌ నేడు తెలంగాలో బంగారంల రెండు పంటలు పక్కాగ పండుతున్నామయంటే అది కేసీఆర్‌ ఘనతే అన్నారు. ఒక నాడు కరువుతో ఉన్నాం. నేడు సస్యశ్యామలంగా మార్చుకున్నాం. మళ్లీ కాంగ్రెస్‌ పార్టీకి అధికారం ఇస్తే 10ఏండ్లు వెనక్కి పోతామని హెచ్చరించారు. అందరం కలిసి అభివృద్ధిలో భాగస్వామ్యం అవుదామని పిలుపునిచ్చారు.