అధికారమివ్వండి.. అగ్నిపత్ రద్దు చేస్తాం
` జవాన్లు రోజువారీ కూలీలు కాదు
` దేశరక్షణను భాజపా ప్రమాదంలోకి నెట్టింది
` ఇండియా కూటమికి అధికారమిస్తే జన్‌ధన్ ఖాతాలు కట్
` మీ నగదును బదిలీ చేసేసుకుంటారు
` విపక్ష కూటమి క్యాన్సర్ కన్నా డేంజర్
` యూపీ ప్రచారంలో ప్రధాని మోడీ హెచ్చరిక
లక్నో(జనంసాక్షి):ప్రతిపక్షాలు అధికారంలోకి వస్తే జనధన్ బ్యాంక్ ఖాతాలు మూసి వేసి అందులోని నగదు లాగేసుకొంటాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. తన ప్రభుత్వ హయాంలో పేదవారి కోసం దాదాపు 50 కోట్లకు పైగా జనధన్ యోజన ఖాతాలను ప్రారంభించానని తెలిపారు. బుధవారం ఉత్తరప్రదేశ్ లోని శ్రావస్థిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఆ ఖాతాలన్నీ ప్రతిపక్షాలు మూసి వేస్తాయని ప్రధాని మోదీ స్పష్టం చేశాయి. ప్రధానిగా తాను దేశంలో ప్రతీ గ్రామానికి విద్యుత్ సరఫరా తీసుకు వచ్చానన్నారు. అదే ప్రతిపక్షం అధికారంలోకి వస్తే మాత్రం ఆ యా గ్రామాలన్నీ విద్యుత్ కోతల ద్వారా చీకటిలోకి నెట్టేస్తాయని విమర్శించారు. ఇక ప్రతీ ఇంటికి తాను కుళాయి ద్వారా నీళ్లు అందించానని గుర్తు చేశారు. అయితే ఇంటికి దూరంగా నీటి కుళాయిలు ఏర్పాటు చేయ గల నైపుణ్యంలో ప్రతిపక్షాలు పేరు సంపాదించాయని చెప్పారు. ఇక 4 కోట్ల మంది పేద ప్రజలకు కోసం నిర్మించిన ఇళ్లు.. ఎస్పీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ల ఓటు బ్యాంక్‌కు కట్టబెడతారన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఏం చేసినా.. దానికి విరుద్దంగా చేయడం ఎస్పీ, కాంగ్రెస్ పార్టీల ప్రత్యేకత అని ప్రధాని మోదీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాదిస్తే.. ప్రస్తుతం జైల్లో ఉన్న తీవ్రవాదులందరని.. ప్రధానమంత్రి తన నివాసంలో బిర్యానీ తినేందుకు ఆహ్వానిస్తారన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ర్యాలీలో పాల్గొంటున్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌లపై ప్రధాని మోదీ ఈ సందర్బంగా వ్యంగ్య బాణాలు సంధించారు.
వీరిద్దరు పాల్గొంటున్న బహిరంగ సభలకు భారీగా జనం తరలివచ్చిన కొన్ని వీడియోలను తాను చూశానని ప్రధాని మోదీ తెలిపారు. ఈ సభలకు హాజరయ్యేందుకు ఈ రెండు పార్టీలు ప్రజలకు నగదు పంచి పెడుతున్నాయని.. అందుకే వారంతా వస్తున్నారని మోదీ విమర్శించారు. ప్రజలకు నగదు ఇవ్వకుండా ర్యాలీలకు తీసుకు రావాలని ఎస్పీ, కాంగ్రెస్ పార్టీల నేతలకు ప్రధాని మోదీ సూచించారు. అయితే వాళ్ల పరిస్థితి ఇలా ఉంటే.. వారు విూ కోసం ఏం పని చేస్తారంటూ ప్రజలను ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రశ్నించారు. అలాగే విపక్ష ఇండియా కూటమి క్యాన్సర్ కంటే ప్రమాదకారి అని, అది వ్యాపిస్తే దేశాన్నే నాశనం చేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. విపక్ష ఇండియా కూటమికి మతతత్వం, తీవ్ర జాతి వివక్ష, బంధుప్రీతి వంటి వ్యాధులున్నాయన్నారు. ఇవి క్యాన్సర్ కంటే ప్రమాదకరమైన వ్యాధులన్నారు. మోదీ దేశవ్యాప్తంగా 4 కోట్ల మంది పేదలకు ఇళ్ళు ఇచ్చారని, ఇప్పుడు సమాజ్‌వాది, కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తే అన్నింటినీ తారుమారు చేస్తారని హెచ్చరించారు. విపక్షాలు గెలిస్తే పేదలకు తాము నిర్మించిన ఇళ్లను గుంజుకుని వాటిని తమ ఓటు బ్యాంకుకు పంచివేస్తాయని ఆరోపించారు. తాను ప్రారంభించిన 50 కోట్లకు పైగా జన్ ధన్ ఖాతాలను మూసివేసి ఆ డబ్బును వారు లాగేసుకుంటారని విమర్శించారు. మోడీ ప్రతి గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పిస్తే విపక్షాలు విద్యుత్ కనెక్షన్లను కట్ చేసి మళ్లీ చీకట్లోకి తీసుకువెళతాయన్నారు.