అధికారులను అభినందించిన కలెక్టర్…
జనగామ కలెక్టరేట్ సెప్టెంబర్ 19(జనం సాక్షి):తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలను విజయవంతంగా నిర్వహించిన అధికారులను జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య అభినందించారు.
సోమవారం కలెక్టర్ కార్యాలయ ప్రజావాణి కార్యక్రమంలో ఈ నెల 16,17,18 తేదీలలో మూడు రోజుల పాటు నిరంతరంగా నిర్వహించిన తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకల విజయవంతముకు సమన్వయంతో కృషి చేసిన ప్రతి అధికారిని పేరుపేరునా అభినందించారు.ఇదే స్ఫూర్తితో ఇకముందు కూడా కార్యక్రమాల విజయవంతానికి కృషి చేయాలని కోరారు.
ReplyForward
|