అధికారులపై ఆగ్రహం నెలాఖరులోగా పనులన్నీ పూర్తిచేయాలి

జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
మహాదేవపూర్ జూన్ 24 ( జనంసాక్షి)
 మహాదేవపూర్ మండల కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మన ఊరు-మన బడి అభివృద్ధి పనులపై జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా పరిశీలించి అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు అలాగే .గర్ల్స్ హైస్కూల్ డైనింగ్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేశారు.పాఠశాల విద్యార్థులు,ప్రజాప్రతినిధులు,ఉపాధ్యాయులు జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా కు  అపూర్వ స్వాగతం పలికారు. గ్రామానికి విచ్చేసిన జిల్లా కలెక్టర్ గారికి ప్రజాప్రతినిధులతో కలిసి సర్పంచ్ శ్రీపతిబాపు మొక్క ను కానుక గా అందజేసి,శాలువాతో ఘనంగా సన్మానించరు.పనుల పురోగతిని పరిశీలించిన అనంతరం,పనుల్లో వేగం పెంచాలని, పనులన్నీ నెలాఖరులోగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారిణి జడ్పీ సీఈఓ శోభారాణి,ఎంపీపీ బి రాణి బాయి,జడ్పీటీసీ గుడాల అరుణ,ఎంపీటీసీ ఆకుతోట సుధాకర్ పంచాయతీ రాజ్ డిఈ సాయిలు, భగీరథ ఏఈ అరుణ్ కుమార్,ఎంపీడీఓ శంకర్ నాయక్,ఎంపీఓ ప్రసాద్,గ్రామ కార్యదర్శి రజినీకాంత్ రెడ్డి,ఉపాధి హామీ ఇంజనీర్ కాటారపు శ్రీనివాస్,ప్రధానోపాధ్యులు అశోక్,సతీష్,తిరుపతిరెడ్డి,ఎస్ ఎం సీ కమిటీ చైర్మన్లు నలబూగ ధర్మయ్య,మజీద్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.