అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన
జిల్లా ఎంపీటీసీల ఫోరం ఉపాధ్యక్షురాలు నిమ్మ వాణి
టేక్మాల్ జనం సాక్షి సెప్టెంబర్ 3 ఆసరా పెన్షన్ కార్డులు పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించని అధికారులపై ఆగ్రహం వక్తం చేసిన మెదక్ జిల్లా ఎంపీటీసీల ఫోరం ఉపాధ్యక్షులు నిమ్మ వాణి రమేష్. ప్రభుత్వం నిర్వహించే అధికారిక కార్యక్రమాలకు ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులను పక్కన పెట్టి టిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పార్టీ నాయకులను వేదికపై కూర్చోబెట్టి వారితో మాట్లాడించడం ఎంతవరకు సమంజసం అని అధికారులను నిలదీశారు. ప్రజా ప్రతినిధులను ప్రోటోకాల్ పాటించకపోవడం అధికారులు పద్ధతి మార్చుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.