అధికారులు,స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సమన్వయంతో జిల్లాను అభివృద్ధి చేయాలి.

జిల్లా పరిషత్ చైర్పర్సన్ పెద్దపల్లి పద్మావతి బంగారయ్య.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, జూన్22(జనం సాక్షి):
ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అధికారులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సమన్వయంతో జిల్లాను అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లాలని,అందులో ప్రజాప్రతినిధులను తప్పనిసరిగా భాగస్వాములను చెయ్యాలని  జడ్‌పి చైర్‌పర్సన్‌ పెద్దపల్లి పద్మావతి బంగారయ్య పేర్కొన్నారు.జిల్లా ప్రజాపరిషత్‌ స్థాయీ సంఘాల సమావేశాలు 1వ,7వ స్థాయి సంఘాలకు ఆమె అధ్యక్షత వహించగా, 6వ స్థాయి సంఘం సమావేశానికి ఉర్కొండ జెడ్ పి టి సి శాంతకుమారి చైర్ పర్సన్ అధ్యక్షత వ్యవహరించారు.బుధవారం స్థానిక జడ్‌పి కార్యాలయంలో జిల్లా ఎస్సి అభివృద్ధి, ఎస్సీ కార్పొరేషన్, జిల్లా బీసీ అభివృద్ధి, జిల్లా మైనార్టీ సంక్షేమం, జిల్లా గిరిజన అభివృద్ధి, మిషన్ భగీరథ, ఆర్థిక ప్రణాళిక, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, జిల్లా రహదారులు మరియు భవనాలు, నీటిపారుదల శాఖల అభివృద్ధిపై మరియు పురోగతి కొత్తగా ప్రతిపాదనలు జరిగిన పురోగతి పనుల వివరాలపై చర్చించి, సమీక్షించారు.ముందుగా జిల్లా అధికారులు, స్థానిక ఎంపీడీవోలు ప్రజాప్రతినిధులతో సమన్వయం లేకుండా పనిచేస్తున్నారని, కనీసం వివిధ శాఖల లో జరుగుతున్న అభివృద్ధి పనులు మరియు కార్యక్రమాల గురించి కూడా కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదని, దీనికి బాధ్యులెవరు..? వారిపై చర్యలు తీసుకోవాలని 6వ స్థాయి సంఘం చైర్ పర్సన్ ఊర్కొండ జడ్పిటిసి శాంతకుమారి, కల్వకుర్తి జడ్పిటిసి స్థాయి సంఘల సభ్యులు భరత్  ప్రసాద్ లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తపరిచారు.
అధికారులు తమ మండలాల్లో జరుగుతున్న మంత్రుల అభివృద్ధి కార్యక్రమాల్లో తమకు ముందస్తు సమాచారం మండల అభివృద్ధి అధికారులు ఎందుకు ఇవ్వటం లేదని సభ్యులు భరత్ ప్రసాద్ సంబంధిత అధికారులను ప్రశ్నించారు.ప్రజా ప్రతినిధులు తమ పరిధిలోని వసతి గృహాలను సందర్శించినప్పుడు సంబంధిత వసతిగృహాలు అధికారులు ప్రోటోకాల్ను పాటించడంలేదని, పాటించేలా చర్యలు తీసుకోవాలని భరత్ ప్రసాద్ అన్నారు.
పాఠశాలలు ప్రారంభమైన సందర్భంగా అన్ని పాఠశాలలు అంగన్వాడీలకు మిషన్ భగీరథ నీటిని అందించాలన్నారు అదేవిధంగా మన ఊరు మన బడి ద్వారా పాఠశాలల్లో చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని సూచించారు.సమావేశంలో పాల్గొన్న సభ్యులు ఉప్పునుంతల జడ్పిటిసి అనంత ప్రతాపరెడ్డి, అచ్చంపేట జడ్పిటిసి ముడావత్ మంత్ర్యా నాయక్ లు ఆయా శాఖల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలను సంబంధిత శాఖల అధికారులతో చర్చించారు.
రోడ్లు భవనాల శాఖ  ఈఈ భాస్కర్ మాట్లాడుతూ..నాగర్ కర్నూల్ జిల్లాలోని 56 కిలోమీటర్ల రహదారులకు సెంట్రల్ రోడ్డు ఫండ్ ద్వారా 72 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని, తెలిపారు.
దళిత బంధు పథకం ద్వారా జిల్లాలోని 4 నియోజకవర్గాల పరిధిలో 14 కోట్ల రూపాయలతో 142 మంది లబ్ధిదారులకు ఇప్పటివరకు వాహనాలను అందించడం జరిగిందన్నారు.ఒక కోటి రూపాయలతో 18 మంది లబ్ధిదారులకు వివిధ రకాల వ్యాపారాలు పెట్టుకునేందుకు లబ్ధిదారులకు అందించడం జరిగిందని, జూలై చివరి నాటికి నాలుగు నియోజకవర్గాల్లో ఎంపిక చేసిన లబ్ధిదారులందరికీ అందజేయడం జరుగుతుందని అదేవిధంగా చారకొండ మండలానికి సంబంధించిన లబ్ధిదారులకు గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీదుగా లబ్ధిదారులకు యూనిట్లను అందజేయనున్నట్లు ఆయన తెలిపారు.
మండలాల పరిధిలో నిర్వహించే సర్వ సభ సమావేశాలకు హాజరుకాని ఆయా శాఖల అధికారుల వివరాల ఆయా శాఖల జిల్లా ఉన్నతాధికారుల నివేదించిన ప్పటికీ చర్యలు చేపట్టడం లేదని జిల్లా పరిషత్ సీఈఓ ఉష స్థాయి సంఘాల వృష్టికి తీసుకొచ్చారు.వెనుకబడిన తరగతుల వసతి గృహాల్లో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచేందుకు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని సహాయ జిల్లా వెనుకబడిన తరగతుల సహాయ అధికారి శ్రీధర్ జి కోరారు.
ఈ కార్యక్రమంలో హాజరైన ఆయా శాఖల జిల్లా అధికారులు తమ శాఖల ప్రగతి నివేదికలను చదివి వినిపించారు.
శాఖల అభివృద్ధి కార్యక్రమాన్ని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు తప్పనిసరిగా సమాచారం అందజేయాలని, అధికారులు జిల్లా అభివృద్ధికి దోహదపడేలా కృషి చేయాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ పెద్దపల్లి పద్మావతి బంగారయ్య అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో సీఈఓ ఉష, స్థాయి సంఘాల సభ్యులు భరత్ ప్రసాద్ ముడావత్ మంత్ర్యా నాయాక్, అనంత ప్రతాపరెడ్డి, జిల్లా అధికారులు అశోక్, భాస్కర్, దామోదరరావు,రామ్ లాల్, శ్రీధర్ జీ, శ్రీధర్ రావు, నర్సింగ్ రావు, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.