అధికారులు గ్రామాల్లో పర్యటించి పంట నష్టం పై సర్వే నిర్వహించాలి
టి జె ఎస్ ప్రధాన కార్యదర్శి నిజ్జన రమేష్
ఎల్లారెడ్డి 26 జులై ( జనంసాక్షి ) ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రం లో టి జె ఎస్ రాష్ట్ర కార్యదర్శి నిజ్జన రమేష్ ఆధ్వర్యం మంగళవారం పంట నష్టం పై ఆర్ డి ఓ శ్రీను నాయక్ అందుబాటులో లేనందున ఏవో కు టి జె ఎస్ పార్టీ కార్యదర్శి నిజ్జన రమేష్ వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ
ఈ మధ్యకాలంలో వర్షాలు భారీగా కురుస్తున్నాయి,అందువలన అధికారులు చొరవ తీసుకుని గ్రామాలలో పర్యటించి సర్వే నిర్వహించాలి,
చాలామంది రైతుల పంట నష్టం జరిగిందని
చాలా వరకు ఇండ్లు కూడా కూలిపోయాయి,
రోడ్లు కూడా గుంతలు పడ్డాయి, కొట్టుకుపోయాయి,
నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం గుర్తించి వాస్తవాలు వెలికి తీసి ఆదుకోవాలి అని అన్నారు,
ఇండ్లు కూలి నష్టపోయిన బాధితులకు డబల్ బెడ్ రూమ్ లు ఇవ్వాలి
పంట నష్టపోయిన రైతులకు ఆర్థికంగా ఎకరాకు 25 వేల రూపాయలు ఇవ్వాలని
తెలంగాణ జన సమితి ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇంచార్జ్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిజ్జన రమేష్
ప్రభుత్వం ను డిమాండ్ చేశారు, కె సి ఆర్ ప్రభుత్వం వర్షాలు కురుస్తున్న సమయంలో భరోసా కల్పించకుండా రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేసారు
ఈ కార్యక్రమంలో టి జె ఎస్ పార్టీ కామారెడ్డి జిల్లా కన్వినర్ కుంబాల లక్ష్మణ్ యాదవ్, యువజన విభాగం నాయకులు రామకృష్ణ గౌడ్, కె నారాయణ, సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Attachments area
|