అధికారుల నిర్లక్ష్యంతో పాడిగేద మృతి
కురవి, జూన్ 16 (జనంసాక్షి): విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి పాడిగేదమృతి చెందినసంఘటన శనివారం నేరడ గ్రామంలో చోటుచేసుకుంది. బాదితుల కథనంప్రకారంగా మండలంలోని నేరడగ్రామ చివారు రాయినిపట్నంకు చెందిన శివరాత్రి వెంకన్నకు చెందిన పాడిగేద ఉదయం 6న్నర గంటలకు గ్రామచివా రులో ఉన్న విద్యుత్‌పోలు సపోటు తీగకు తగిలి మృతిచెందింది. అధికారులు గ్రామచివారులోఉన్న విద్యుత్‌పోలు నెం(ఎప్1 బై 31)ఆర్‌పిఎం కు సపోట్ తీగ ను స్తంబానికి సరిచేయకుండా వదిలేయడంవల్ల ఆసపోట్‌తీగ కిందికి వేలాడింది. శనివారం ఉదయం పాడిగేద పాలుపితికిన అనంతరం ఆగేదను మేతకు వది లారు. ఆపోలు ప్రక్కనుండి పోతుండగా కిందికి వేలాడిఉన్న సపో టుతీగ తగి లింది. సపోటుతీగకు కరంటు రావడంతో ఆగేద అక్కడికక్కడె మృతి చెందింది. ఆగెద విలువ 2500రూ ఉంటుందని వెంకన్న తెలిపాడు. గ్రామ వె ల్పర్ రమేష్‌కు పోనుచేసి తెలుపగా, విద్యుత్ తీగలుతగిలి మనిసే చస్తున్నారు. గేదచావడం పెద్దగా ఏముందని, నిర్లక్ష్యంగా సమాదానం చెప్పాడని వెంకన్న తెలిపాడు.