అధికారుల పర్యవేక్షణలో కొనుగోలు కేంద్రాలు

తక్షణమే రైతుల ఖాతాల్లోకి నగదు జమ
సిద్దిపేట,మే21(జ‌నంసాక్షి): జిల్లాలో ఇప్పటివరకు  కొనుగోలు చేసిన సెంటర్లలో ఎక్కడ పెండింగ్‌లో ఉండకుండా వెనువెంటనే మిల్లులకు తరలించే విధంగా పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు. కొనుగోలు కేంద్రాలను జేసీ పద్మాకర్‌, డీఎస్‌వో వెంకటేశ్వర్లు సందర్శించి కొనుగోళ్లను సవిూక్షిస్తున్నారు. వరిధాన్యం గ్రేడ్‌ (ఏ) రకం క్వింటాలుకు రూ.1,770, సాధారణ రకానికి రూ.1,750 మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నారు. అలాగే మొత్తం  6,728మంది రైతుల ఖాతాలో రూ.45 కోట్లు జమ చేశారు. రైతు పండించిన పంటకు సరియైన గిట్టుబాటు ధర కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో ఐకేపీ ద్వారా 95, సహకార సంఘాల ద్వారా 52, మొత్తం 147 కొనుగోలు కేం ద్రాలను ఏర్పాటుచేశారు. ఇందులో జిల్లాలో 13,809 రైతుల నుంచి మహిళా సం ఘాల ద్వారా 95 కేంద్రాల నుంచి 2,61,170 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేయగా, 52 సహకార సంఘాల నుంచి 2,20,189 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. మొత్తం జిల్లాలో 4,81,359 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇందుకు గాను రూ.85.20కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉంది. సోమవారం సాయంత్రం నాటికి 6,728 మంది రైతులకు రూ.45 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు. కొనుగోలు చేసిన ధాన్యంలో ఇప్పటి వరకు ట్యాబ్‌లో 12,810మంది రైతుల వివరాలు ట్యాబ్‌లో అప్‌లోడ్‌ చేశారు. 147 కేం ద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యం లోంచి 4,28,525 క్వింటాళ్ల ధాన్యాన్ని మిల్లులకు తరలించారు. ఇంకా 52,834 క్వింటాళ్ల ధాన్యం మిల్లులకు తరలించాల్సి ఉంది.