అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.
తెలంగాణ రైతు సంఘం నాయకులు.
కోటగిరి ఆగస్ట్ 7 జనం సాక్షి:-అధిక వర్షాల వల్ల పంట నష్టంవాటిల్లిన్న రైతులకు ఎకరాకు రూ.20వేల నష్ట పరిహారం ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘం నిజా మాబాద్ జిల్లా అధ్యక్షులు గంగాధరప్ప,ఉపాధ్యక్షు రాలు నీరడి గంగామణి ప్రభుత్వాన్ని కోరారు.సోమ వారం మండల కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయం లో ఉమ్మడి కోటగిరి మండల రైతు సంఘం ఆధ్వర్యం లో డిప్యూటీ తహసిల్దార్ అబ్దుల్ అజీజ్ కి రైతులకు పంట నష్టరిహారాన్ని చెల్లించాలని వినతి పత్రం అంద జేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.జూలై నెలలో కురిసిన భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా వరి, కందులు,మొక్కజొన్న,సోయా,పెసరు,మినుము పం టలు నీటమునిగి భారీగా నష్టం వాటిల్లిందని అన్నా రు.ఉమ్మడి కోటగిరి మండల వ్యాప్తంగా సుమారు 1200 ఎకరాలలో వరి,400 ఎకరాలలో సోయా పం టలకు నష్టం వాటిలిందని అధికారిక సమాచారం. ఇప్పటివరకు రైతులు ఈ పంటల సాగు కోసం రూ. 20 వేల్లు పెట్టుబడి పెట్టి నష్టపోయారని.ప్రభుత్వం వెంటనే నష్ట పోయిన పంటలకు సర్వే నిర్వహించి రైతులకు ఎకరానికి రూ.20వేల నష్టపరిహారాన్ని ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పి.లక్ష్మణ్,పి.లక్ష్మి ,ఎం.నాగరాజు,పి.సాయిలు,తెలం గాణ రైతు సంఘం (ఏఐకేఎస్) నాయకులు పాల్గొ న్నారు.