అధైర్యపడొద్దు.. ఆత్మహత్యలు చేసుకోవద్దు…
– రైతు కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్
హైదరాబాద్ నవంబర్6(జనంసాక్షి):
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పంజాబ్‌లోని బటిండాలో గత నెలలో ఆత్మహత్య చేసుకున్న రైతు జగ్‌దేవ్ సింగ్(65) కుటుంబ సభ్యులను పరామర్శించారు. పంజాబ్‌లో అకాలీదళ్-భాజపాల సంకీర్ణ ప్రభుత్వంపై రాహుల్ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు.
పంజాబ్ ముఖ్యమంత్రి రైతుల సమస్యలకు ఎలాంటి పరిష్కారం చూపించడంలేదని విమర్శించారు. రైతు కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం రాహుల్ భుకియాన్‌వాలి నుంచి మాల్వలా వరకు పాదయాత్ర చేపట్టారు. రాహుల్ నిన్న ఇటీవల పోలీసుల కాల్పుల్లో మృతిచెందిన ఇద్దరు వ్యక్తుల కుటుంసభ్యులను పరామర్శించారు.