అనాధ వృద్ధులకు మండల్ ప్రెస్ క్లబ్ చేయూత
జాతీయ పత్రిక దినోత్సవం సందర్భంగా ముకుందాపురం గ్రామ శివారులోని ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో మునగాల మండల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అనాధలకు వృద్ధులకు బుధవారం పండ్లు బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ సామాజిక కార్యకర్త వేమూరి సత్యనారాయణ హాజరై మాట్లాడుతూ, జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా ఇలాంటి పేదలైన అనాధ వృద్ధులను గుర్తించి వారికి ప్రెస్ క్లబ్ తరఫున సహాయ సహకారాలు అందించడం ఎంతో అభినందనీయమని అన్నారు. 1956లో భారత తొలి ప్రెస్ కమిషన్ సిఫార్స్ మేరకు 1966 నవంబర్ 16వ తేదిన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేసారని, అప్పటి నుంచి ప్రతి సంవత్సరం నవంబర్ 16వ తేదిన జాతీయ పత్రికా(నేషనల్ ప్రెస్ డే) దినోత్సవాన్ని జరుపుకుంటారని అన్నారు. ప్రత్యేకంగా మునగాల మండల్ ప్రెస్ క్లబ్ మాత్రం ఇటు రాజకీయంగాను అటు సామాజికంగాను అనేక సవాళ్లను ఎదుర్కొని సమాజానికి న్యాయం చేసే విషయంలో వెనుకాడకుండా ఎంతో మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆయన కొనియాడారు. ప్రెస్ క్లబ్ కార్యకలాపాలను ఒకే తాటిపై తీసుకెళ్లగలిగే సామర్థ్యత కలిగిన వ్యక్తిగా సీనియర్ జర్నలిస్ట్ జిఎస్ రెడ్డి ముందున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల్ ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షుడు, సీనియర్ పాత్రికేయులు జి ఎస్ రెడ్డి, అధ్యక్షుడు బెజవాడ గోవర్ధన్, ప్రధాన కార్యదర్శి జె సామ్యూల్, ఉపాధ్యక్షులు ఎస్ కె దస్తగిరి, కోశాధికారి ఎల్ నాగబాబు, జాయింట్ సెక్రటరీ సోమపంగి గోపి, సభ్యులు తుమ్మల వెంకటేశ్వర్లు, నాయిని రమేష్, స్నేహశృతి క్లినిక్ డాక్టర్ సిహెచ్ బాబు, యాలయ్య, ఆశ్రమ నిర్వాహకురాలు విజయమ్మ తదితరులు పాల్గొన్నారు