అనారోగ్యంతో బాధపడుతున్న కార్యకర్తకు అండగా నిలిచిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి.

— ఎల్లయ్య దిగులు చెందకు నేను ఉన్నానని ఎమ్మెల్యే భరోసా.
— స్వయంగా పరామర్శించి.. 50 వేల రూపాయల ఆర్థిక సహాయం..
— చెమర్చిన కళ్ళతో కృతజ్ఞతలు తెలిపిన కార్యకర్త..
సంగారెడ్డి ప్రతినిధి నవంబర్ 09:(జనం సాక్షి):
అభివృద్ధి, సంక్షేమంతో పాటు పార్టీ పటిష్టత కోసం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నారు, పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి .
 పటాన్చెరు నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నారు.
 పటాన్చెరు మండలం పోచారం గ్రామానికి వెళ్తున్న టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కంజర్ల ఎల్లయ్య గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు.
 బుధవారం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్  ఎల్లయ్య గృహానికి వెళ్లి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం కళ్ళారా చూసి, వెంటనే 50 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. దిగులు చెందవద్దని, టిఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
 ఎమ్మెల్యే జిఎంఆర్ స్వయంగా తన ఇంటికి వచ్చి ఆర్థిక సాయం అందించడం పట్ల ఎల్లయ్య తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఎమ్మెల్యే జిఎంఆర్ కి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని తెలిపారు.