అనారోగ్య సమస్యతో బాధపడుతున్న యువతి తండ్రికి ఎల్.ఓ.సి అదించిన.*ఆపద్బాంధవుడు ఎమ్మెల్యే సైదిరెడ్డి*
నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్.పట్టణానికి చెందిన
బాలెన వెంకటకృష్ణ కూతురు బాలెన నవ్య వైద్య ఖర్చుల నిమిత్తం హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి బుధవారం ఎల్ఓసి ధృవ పత్రాన్ని అందించారు.నేరేడుచర్ల పట్టణ కేంద్రంలో,యువతీ తండ్రి బాలెన వెంకటకృష్ణకు ఎల్.ఓ.సి ధృవ పత్రాన్ని అందించారు.నవ్య దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతూ.హైదరాబాద్ నిమ్స్ వైద్యశాలలో చికిత్స తీసుకుంటున్నది.వైద్యానికి ఇప్పటికే చాలా ఖర్చు అయి డబ్బులు లేక ఇబ్బంది పడుతూ విషయం హుజూర్నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి కి తెలియజేశారు.వెంటనే స్పందించిన ఎమ్మెల్యే నవ్య వైద్యానికి అవసరమైన రెండున్నర లక్షల రూపాయల ఎల్.ఓ.సి ని ప్రభుత్వం నుండి మంజూరు చేయించి ఆ ఇంటి పాలిట ఆపద్బాంధవుడయ్యారు. అయన వెంట టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షురాలు,మున్సిపల్ వైస్ చైర్మన్ చల్ల శ్రీలత రెడ్డి, గ్రంధాలయం చైర్మన్ గుర్రం మార్కండేయ, పిల్లలమర్రి పుల్లారావు,యరమాద గిరి, చెరువుపల్లి నరసింహ,నక్కగిరి, ఇంజమురి రాములు తదితరులు ఉన్నారు.
Attachments area