అనిరుద్ రెడ్డి.. మాజీ మంత్రిని విమర్శించే స్థాయి నీది కాదు..
– వార్డ్ మెంబర్ గా గెలవలేని నీవు లక్ష్మారెడ్డిని విమర్శిస్తావా..?
– వ్యక్తిగత విమర్శలు చేస్తే జడ్చర్ల నియోజకవర్గంలో తిరగనివ్వము.
– టిఆర్ఎస్ మండల నాయకులు.
ఊరుకొండ, అక్టోబర్ 1 (జనంసాక్షి):
కాంగ్రెస్ పార్టీ జడ్చర్ల నియోజకవర్గ సమన్వయకర్త
జనంపల్లి అనిరుద్ రెడ్డి.. మాజీ మంత్రి, జడ్చర్ల శాసనసభ్యులు డాక్టర్ చర్లకోల లక్ష్మారెడ్డిని విమర్శించే స్థాయి నీది కాదని టిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు బక్క జంగయ్య, మండల అధ్యక్షుడు వీరారెడ్డి లు విమర్శించారు. శనివారం
ఊరుకొండ మండల కేంద్రంలోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. అనిరుద్ రెడ్డి తన సొంత గ్రామంలో వార్డు మెంబర్ గా గెలవలేని నీవు తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా తన పదవి తృణప్రాయంగా రాజీనామా చేసిన మాజీ మంత్రివర్యులు, జడ్చర్ల శాసనసభ్యులు డాక్టర్ చర్ల కోల లక్ష్మారెడ్డిని విమర్శించే స్థాయి నీది కాదని వారు మండి పడ్డారు. మీరు కొల్లూరు మండలం కావాలి అని అడుగుతున్నారు కదా.. చేతకాని ఎమ్మెల్యే అని అంటున్నారు కదా చేతకాని ప్రభుత్వం అంటున్నావు.. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడున్న కొత్త చట్టం ప్రకారం 7 ఎంపీటీసీలు అవసరం ఉంటుంది. చట్ట ప్రకారం కనీసం మీరు రెండు లేదా ముగ్గురిని ఎంపిటిసిలను తీసుకొని రా.. మీకు మండలాన్ని చేసి చూపిస్తాడు మా లక్ష్మన్న అనీ స్పష్టం చేశారు. వ్యక్తిగత విమర్శలు మానుకోకపోతే చర్యలు తప్పవు అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అనిరుధ్ గారు మీరు స్థాయిని మించి మాట్లాడుతున్నారు. నాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎమ్మెల పదవిని తృణ ప్రాయంగా త్యాగం చేసిన గొప్ప మనసున్న మా లక్ష్మారెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శించే అర్హత, స్థాయి నీకు లేదు అని గుర్తు చేశారు. గత 60 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ పార్టీ రాష్టాన్ని భ్రష్టుపట్టించారు. 8 సంవత్సరాల నుంచి జడ్చర్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నిలుపుతున్న మా నాయకుడిని చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారు తప్ప జడ్చర్ల నియోజకవర్గ ప్రజలకు మీ వల్ల ఒరిగేది ఏమి లేదని అన్నారు. జడ్చర్ల నియోజకవర్గంలో రెండు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు, రెండు వర్గాలు నెలకొన్నాయి, ముందు దమ్ము ధైర్యం ఉంటే అది తేల్చుకోండి, ఇక మీద నైనా అనిరుద్ రెడ్డి చౌకబారు రాజకీయాలు మానుకోవాలని లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. మా ఎమ్మెల్యే ఎన్నడూ కూడా ఒక మాట కూడా అనరు మా సార్ అంత ఓపిక మాట్లాడుతాడు మా సార్ కి అంత కోపం వచ్చిందంటే అర్థం చేసుకోవాలని నువ్వు మా ఎమ్మెల్యే గారికి రెండు ఇల్లు ఉన్నాయ్ అంటున్నావ్ నీకు లేదా మీ ప్రెసిడెంట్ గారికి జూబ్లీహిల్స్ లో పెద్ద ఇల్లు ఉంది కదా, ఆలోచించి మాట్లాడు అని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీలో నీకు ప్రజాబలం లేదని అందరికీ తెలుసు, జడ్చర్ల కల్వకుర్తి అడ్డా మీద కూలీలను తీసుకొని సమావేశాలు ఏర్పాటు చేసిన నీకూ ప్రజాబలం ఉన్న లక్ష్మారెడ్డిని వ్యక్తిగత విమర్శలు చేస్తే నియోజకవర్గంలోని గ్రామాల్లో నిన్ను కాలు మోప నివ్వమని హెచ్చరించారు. దమ్ము ధైర్యం ఉన్న గొప్ప మహానుభావుడు అయ్యా పని ఉంటే తప్పకుండా చేస్తాడు నువ్వు చెప్పనవసరం లేదు ఫస్ట్ కాంగ్రెస్ సర్పంచిని ఒప్పించు అని అనిరుద్ రెడ్డిని తెరాస మండల అధ్యక్షుడు వీరారెడ్డి హెచ్చరించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ అరుణ్ రెడ్డి, సర్పంచ్ లు కొమ్ము రాజయ్య, సుదర్శన్, మండల నాయకులు రమేష్, కొమ్ము శ్రీను, పోలె నరేష్, బండి మల్లేష్, రాచకొండ గోపి, మల్లేపల్లి వెంకటయ్య, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.