అనుకున్న సమయానికంటే ముందే మిషన్ భగీరథ నీళ్లు
మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి
మహబూబ్ నగర్,ఆగస్టు30 : అనుకున్న సమయానికంటే ముందే మిషన్ భగీరథ మంచి నీళ్లు
ప్రజలకు అందించాలని అధికారులను మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి ఆదేశించారు. బుధవారం పూర్వ మహబూబ్ నగర్ జిల్లా మిషన్ భగీరథ, రైతు సమితుల ఏర్పాటు అంశాలపై జిల్లా పరిషత్ కాన్ఫరెన్స్ హాలులో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, ఎంపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాసగౌడ్, అలా వెంకటేశ్వరరెడ్డి, గువ్వల బాలరాజు, చి/-టటెం రాంమోహన్ రెడ్డి, అంజయ్య యాదవ్, జడ్పీ చైర్మన్ భండారి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయాన్ని అధికారులు మర్చిపోవద్దని హెచ్చరించారు. ఇక సమావేశంలో రైతు సమితుల ఏర్పాటు విూద కసరత్తు ప్రారంభించాలని ఆదేశించారు. అనంతరం ఆర్ అండ్ బి అతిథి గృహంలో నిర్వహించిన ప్రెస్ విూట్ లో మాట్లాడుతూ మంత్రులు మాట్లాడారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కు సంబంధించి ప్రాజెక్టు లు ఆపడం ఎవరి తరం కాదన్నారు. అనవసరమైన కేసులు వేసి ప్రాజెక్టులు ఆపొద్దని హితవు పలికారు. తద్వారా రైతాంగానికి అన్యాయం చేయొద్దని సూచించారు.