అనుమతి లేని హాస్పిటల్స్ పై గట్టి చర్య తీసుకోవాలి

తొర్రూర్ 14అక్టోబర్( జనంసాక్షి )డివిజన్ కేంద్రమైన తొర్రూరులో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేట్ హాస్పిటల్స్ లో నిబంధనలు విరుద్ధంగా నడుస్తున్న వాటిపై గట్టి చర్యలు తీసుకోవాలని సిపిఐ (ఎంఎల్) ప్రజాపంద తొర్రూర్ డివిజన్ కార్యదర్శి కొత్తపల్లి రవిఅన్నారు. తొర్రూర్ ని స్థానిక పార్టీ కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైద్య శాఖ జిల్లా అధికారులు అశ్రద్ధ నిర్లక్ష్యం మూలంగానే తోరూరులో అనేక అనుమతి లేని హాస్పిటల్స్ నడుస్తున్నాయని అన్నారు.నిత్యం తనిఖీ చేయకుండా ఎప్పుడో ఒకసారి వచ్చి తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహించి వారికి గడువు ఇచ్చి పోవడంలో అనేక అనుమానాలను కలిగిస్తున్నాయని రవి అన్నారు.అవసరంలేని పరీక్షలు, అనవసరమైన ఆపరేషన్లు,అధిక మందులు పేద సామాన్య మధ్యతరగతి ప్రజానికంపై ఆర్థిక భారాన్ని పెంచుతున్నారని అన్నారు. చదువులు పూర్తి కానీ డాక్టర్లు మిషనరీ లేని ల్యాబ్లులు,క్వాలిఫికేషన్ లేని డ్రగ్ లిస్టులు ప్రజల ప్రాణాలతో చెలగాట వాడుతున్నారని అన్నారు.నిత్యం తనిఖీలు చేస్తూ అనుమతులేని హాస్పిటల్స్ ను సీల్ చేయవలసిన అధికారులు మీనామేశాలు లెక్కబెట్టడం సరికాదని రవి అన్నారు. ఇప్పటికైనా నిర్దిష్టంగా అనుమతులేని హాస్పిటల్స్ ను క్వాలిఫికేషన్ లేని డాక్టర్స్ ను నడుపుతున్న క్లినిక్స్ బహిరంగంగా ప్రకటించాలని వెంటనే అధికారులు స్పందించకపోతే మా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని రవి హెచ్చరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో *ప్రజాపందా సబ్ డివిజన్ కార్యదర్శి ముంజంపల్లి వీరన్న,పివైఎల్ డివిజన్ అధ్యక్షుడు సిగ్గం యాకయ్య,కార్యదర్శి ధర్మారపు యాక స్వాములు, ఐఎఫ్టియు జిల్లా నాయకులు చింతా నవీన్* తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.