అనుమానాస్పదస్థితిలో యువకుడి మృతి
తాండూరు: అనుమానాస్పదస్థితిలో యువకుడు మృతిచెందిన సంఘటన ఈ రోజు వెలుగులోకి వచ్చింది. మండలంలోని కరన్‌కోటకు చెందిన గుర్తు తెలియని యువకుడు (17) అదివారం అదృశ్యమయ్యాడు. ఈ ఉదయం చంద్రబంచ పొలాల్లోని షెడ్డుకు యువకుడు ఉరివేసుకున్నాడు. మృతదేహానికి సమీపంలో రక్తపు మరకలు ఉన్న కర్ర ఉండటంతో యువకుడి మృతిపై పలు అనుమానాలు వ్య్తమవుతున్నాయి. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు.