అనూహ్య హత్యకేసులో దోషికి మరణదండన

3

– ముంబై హైకోర్టు సంచలన తీర్పు

ముంబై,అక్టోబర్‌30(జనంసాక్షి): సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అనూహ్య హత్య కేసులో ముంబై కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అత్యాచారినిక ఒడిగట్టే వారికి ఇదో గుణపాఠంగా తీర్పును వెలువరించారు. మరెవ్వరూ ఇలఆంటి ఘోరాలకు పాల్పడకూడదన్న రీతితో తీర్పును ఇచ్చారు. అనూహ్యపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన నిందితుడు చంద్రభానుకు ఉరిశిక్ష విధించాలని ప్రాసిక్యూషన్‌ చేసిన వాదనతో కోర్టు ఏకీభవించింది. ఈమేరకు చంద్రభానును దోషిగా పేర్కొంటూ ఉరిశిక్ష విధించింది. మచిలీపట్నంకు చెందిన టెక్కీ అనూహ్య హత్యకేసులో దోషి చంద్రభాన్‌కు ముంబై కోర్టు ఉరిశిక్ష విధించింది. ముంబైలో హత్యకు గురైన అనూహ్య కేసులో దోషికి ఉరి శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. ముంబయి సెషన్స్‌ కోర్టు శుక్రవారం తుదితీర్పు వెలువరించడంతో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్‌ గా టిసిఎస్‌ ముంబైలో పనిచేస్తున్న అనూహ్యను మాయమాటలతో బెదరించి ఒక టాక్సీ డ్రైవర్‌ దారుణంగా హత్య చేయడం తీవ్ర సంచలనం రేపింది. చంద్రభాన్‌ను పట్టుకోవడంలో పోలీసులు సమర్ధంగా పనిచేశారు. విచారణ తర్వాత దోషి అని నిర్ధారణ అయింది. ప్రాసిక్యూషన్‌ ఇతడికి ఉరి శిక్ష వేయాలని సూచించింది. వీటిపై పరిశీలన చేసిన కోర్టు అతినికి ఉరిశిక్షను ఖరారు చేసింది. ఈ తీర్పు పట్ట అనూహ్య తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. తమ కూతురికి జరిగిన పరిస్థితి ఎవరికి రాకూడదని వారు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. 2014 జనవరి 5న సంచలనం రేకెత్తించిన సాప్ట్‌వేర్‌ ఉద్యోగిని ఎస్తార్‌ అనూహ్యపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడు చంద్రభాన్‌ను మంగళవారం ముంబయి సెషన్స్‌ కోర్టు దోషిగా నిర్ధరించింది. ఐపీసీ సెక్షన్‌ 376(అత్యాచారం), సెక్షన్‌ 302(హత్య), సెక్షన్‌ 397(దోపిడీ, హత్య) నేరాల అంతర్గతంగా దోషిగా తేల్చిన ముంబయి సెషన్స్‌ కోర్టు(ప్రత్యేక మహిళా న్యాయస్థానం) న్యాయమూర్తి వృషాలి జోషీ తీర్పును వెలువరిచారు. ఈ కేసులో విచారణ 22నెలల పాటు సుదీర్ఘంగా సాగింది.

తీర్పు ఇతరులకు హెచ్చరిక కావాలి

తీర్పుపై అనూహ్య తండ్రి ప్రసాద్‌ హర్షం వ్యక్తం చేశారు. ఇక విూదట ఎవరైనా ఆడపిల్లల జోలికి వెళ్లాలంటే భయపడాలని, అలాగే ఈ తీర్పు ఉందని ఆయన అన్నారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని తమ ఇంట్లో ఆయన శుక్రవారం నాడు విూడియాతో మాట్లాడారు. ఈ తీర్పునేరస్థులకు గుణపాఠంగా ఉంటుందని నమ్మకం కలిగిస్తోందన్నారు. ఈ కేసు విషయంలో తమకు అండగా ఉన్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. తొలిసారి నన్ను చూసినప్పుడు నేను అనూహ్య తండ్రినని అతడికి తెలియదు   నాకెందుకో అతడి విూద కోపం రాలేదు గానీ, నేరం చేశానన్న ఆలోచన గానీ, భయం గానీ కనపడలేదు   అతడిని నేను చూడటం అదే మొదటిసారి, చివరిసారి అన్నారు.  మొదట్లో ఈ కేసు విచారణలో నాకు కొన్ని అనుమానాలు వచ్చాయి. అనూహ్య బైకు ఎందుకు ఎక్కుతుంది, అంత దూరం వెందుకు వెళ్తుందని అనిపించింది. ఆమె రెండో ప్లాట్‌ఫారం విూద దిగి, నాలుగో ప్లాట్‌ ఫారం విూదకు వచ్చింది. ముందు తనకు కారు ఉందని చెప్పాడు, తర్వాత బైకు విూద తీసుకెళ్లాడు.  బహుశా తన సామాన్లు పోతాయనే భయంతో ఆమె వెళ్లి ఉంటుందేమో. తను చాలా సెన్సెటివ్‌గా ఉండేది.. ఎవరైనా గట్టిగా మాట్లాడినా ఏడ్చేసేది అంటూ వివరించారు.   ఉరిశిక్ష వేయకూడదనే మానవతావాదులు, మానవహక్కుల వాళ్లు ఉన్నారు

కానీ ఇలాంటి క్రూర మనస్తత్వం ఉన్నవాళ్లకు కూడా ఇలాంటి శిక్షలు వేయకపోతే ఏముంది, నాలుగు రోజులు జైల్లో ఉంటే సరిపోతుందేమో అనుకుంటారు.   ఇలాంటి వాళ్లకు ఉరిశిక్ష వేస్తేనే సరైనదని నేను ముందునుంచి భావించాను.    ఈ శిక్ష చూసిన తర్వాత ఆడపిల్ల జోలికి వెళ్లాలంటే భయపడాలి.. ఈవ్‌ టీజింగ్‌ చేసేవాళ్లు కూడా భయపడాలి .   టీజింగ్‌ గురించి సినిమాల్లో కూడా పాజిటివ్‌గా చూపిస్తున్నారు అక్కడంతా బాగానే ఉంటుంది కాబట్టి పర్వాలేదు గానీ, బయట సమాజంలో అలా లేదు. సమాజంలో తెలివిగా ఉండాలని తెలియజేయాలి. చంద్రభాన్‌ ఇక హైకోర్టుకు వెళ్లినా కూడా.. పోలీసుల వద్ద నూటికి నూరుశాతం ఆధారాలు ఉండటంతో అక్కడ కూడా మరణశిక్షను తప్పించుకునే అవకాశం లేదని అనుకుంటున్నానని అన్నారు. అతడి కుటుంబ సభ్యులు కూడా సాక్ష్యం చెప్పారు.  కేసు జరుగుతున్నప్పుడు కూడా ముంబై పోలీసులు పిలిచి, నన్ను తీసుకెళ్లి తాము సేకరించిన సాక్ష్యాల గురించి వివరించారు. దాంతో నాకు నమ్మకం కలిగిందన్నారు.

ఆరోజు ఏం జరిగిందంటే….?

విజయవాడకు చెందిన ఏస్తార్‌ అనూహ్య ముంబయిలోని అంధేరిలోని టీసీఎస్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. 2013 డిసెంబర్‌లో క్రిస్మస్‌ సెలవులకు స్వగ్రామానికి వెళ్లి 2014 జనవరి 5న ముంబయి కుర్లాలోని లోక్‌మాన్య తిలక్‌ టెర్మినస్‌  రైల్వే స్టేషన్‌లో దిగింది. అప్పట్నుంచి ఆమె ఆచూకీ తెలియకుండా పోయింది. సరిగ్గా 11రోజుల తర్వాత జనవరి 16న పాక్షింగా కుళ్లిన, సగభాగం శరీరం కాలిపోయిన స్థితిలో ఆమె మృతదేహం కంజూర్‌మార్గ్‌, బాండూప్‌ నిర్మానుష్య  ప్రాంతంలో కనుగొన్నారు. జనవరి 5న తెల్లవారుజూమున నాలుగు గంటల ప్రాంతంలో చంద్రభాన్‌ దొంగతనం చేయాలనే తలంపుతో లోక్‌మాన్య తిలక్‌ టర్మీనస్‌(ఎల్‌టిటి) రైల్వే /-టసేషన్‌కు చేరుకున్నాడు. ముంబయికి చేరిన అనూహ్యను గమనించాడు. ట్యాక్సీ డ్రైవర్‌గా నటించి రూ.300లకే అంధేరిలోని హాస్టల్‌ గది వద్ద విడిచిపెడతానంటూ నమ్మించి రైల్వే స్టేషన్‌ బయటకు తీసుకొచ్చాడు. ట్యాక్సీలో కాకుండా బలవంతంగా బెదిరించి మోటార్‌ సైకిల్‌పై ఎక్కించుకుని, కంజూర్‌మార్గ్‌ విూదుగా హైవేకు అనుకుని నివాసంఉంటున్న కార్వే నగర్‌కు రెండు కి.విూ దూరంలోని నిర్మాను/-యష ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఘోరానికి ఒడిగట్టాడు.

తనను ప్రాణాలతో విడిచిపెట్టాలని, అందుకు రూ.2లక్షలు ఇస్తానని అనూహ్య ప్రాధేయపడినప్పటికీ చంద్రభాన్‌ మనస్సు కరగలేదు. ఈ విషయాన్ని అతనే పోలీసుల విచారణలో వెల్లడించారు. ప్రస్తుతం తన వద్ద ఉన్న నగదు మొత్తం ఇచ్చివేస్తానని విడిచిపెట్టాలని ఆమె ప్రాధేయపడినట్లు, ఆతర్వాత ఒకటి, రెండు లక్షలు సర్దుబాటు చేసి ఇస్తానని తెలిపింది. అయినా అతను కరగలేదు.  చివరకు అత్యంత క్రూరంగా అత్యాచారానికి పాల్పడి, అనంతరం గొంతునలిపి చంపేశాడు. అనంతరం ఆమె మృతదేహాంపై పెట్రోల్‌ కుమ్మరించి నిప్పంటించాడు. ఏ మోటార్‌ సైకిల్‌పై అయితే అనూహ్యను తీసుకెళ్లాడో అది చంద్రశేఖర్‌ సాహు అనే స్నేహితుడిది. ఆతర్వాత అత్యాచారం, హత్య గురించి స్నేహితుడికి పూర్తిగా చెప్పేశాడు. ఆ తర్వాత అనూహ్య దుస్తులు, కంటి అద్దాలను, హ్యాండ్‌ బ్యాగ్‌ను చంద్రభాన్‌ చెల్లెలి మెస్‌లో పెట్టి అక్కడ్నుంచి నాసిక్‌కు పారిపోయాడు. అక్కడ మారువేషంలో సంచరించేవాడు. క్రైంబ్రాంచ్‌ పోలీసులు ఎల్‌టిటి రైల్వే స్టేషన్‌, ఆయా పరిసరాల్లో ఉన్న 36సీసీటీవీ కెమరాలాలోని ఫుటేజ్‌లను క్షుణంగా పరిశీలించారు. తొమ్మిది బృందాలుగా పోలీసులు దర్యాప్తును ముమ్మరంగా ప్రారంభించారు. కంజూర్‌మార్గ్‌లోని కార్వేలో నివాసముంటున్న తల్లిదండ్రులను కలిసేందుకు వచ్చిన చంద్రభాన్‌(28)ను సీసీటీవీ ఫొటేజ్‌ దృశ్యాల ఆధారంగా అనూహ్య హత్యకు రెండు నెలల తర్వాత పోలీసులు అరెస్టు చేశారు. ఆతర్వాత అనూహ్య హ్యాండ్‌ బ్యాగ్‌, దుస్తులు, లాప్‌టాప్‌ తదితర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 22నెలల పాటు సాగిన విచారణలో పోలీసులు సాక్షాధారాలతో నేరంరుజువు చేయడంలో

సఫలీకృతమయ్యారు. దీంతో ముంబయి సెషన్స్‌ కోర్టు ప్రత్యేక మహిళా న్యాయస్థానం న్యాయమూర్తి వృశాలీ జోషి చంద్రభాన్‌ను దోషీగా నిర్దారించారు.