అన్నదాతలను ఆర్థికంగా ఆదుకోవడానికే కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

ఎంపీపీ కల్లూరి హరికృష్ణ
శివ్వంపేట నవంబర్ 11 జనంసాక్షి : అన్నదాతను ఆదుకోవాలనే లక్ష్యం తో ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయిందని ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి, వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అద్యక్షులు లావణ్య మాధవరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు రమణ గౌడ్ లు పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిధిలోని తాళ్లపల్లి తాండా, లచ్చిరెడ్డి గూడెం గ్రామాల్లో  పిఎసియేస్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వారు  ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఎంపీపీ కల్లూరి హరికృష్ణ మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులవ్వరు అధైర్యపడాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. పంటలను వారి గ్రామాలలోనే విక్రయించుకుని లాభాలు పొందాలనే ఒక మంచి ఆలోచనలతో సీఎం కేసిఆర్ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని ఆయన అన్నారు. పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను  ఎంత కష్టమైన,ఎంత నష్టమైన గానీ సీఎం కేసిఆర్ ప్రభుత్వం గిట్టుబాటు ధరలను కల్పించి కొనుగోలు చేస్తుందని ఆయన అన్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చే రైతులు పట్టాదారు పాసుపుస్తకం జిరాక్స్, ఆధార్ కార్డు జీరాక్స్, అకౌంట్ జురాక్స్ అందిస్తే రెండు, మూడు రోజులలో రైతుల ఖతాలలోకే నేరుగా ధాన్యం డబ్బులు జమ అవుతుందని ఆయన అన్నారు. ఈకార్యక్రమంలో  గూడూర్ ఎంపీటీసీ గోవింద్ నాయక్, లచ్చిరెడ్డి గూడెం సర్పంచ్ ఆలేటి శ్రీనివాస్ రెడ్డి, మండల కో ఆప్షన్ మెంబర్ లాయక్, దంతాన్ పల్లి ఉప సర్పంచ్ మొలుగు నాగేశ్వరరావు, తాల్లపల్లి తాండా నాయకులు గుగ్లోత్ సక్రు నాయక్, గిరిజన తాండాల సమన్వయకర్త గేమ్ సింగ్ నాయక్, గ్రామ కమిటీ అధ్యక్షులు గుగ్లోత్ రమేష్ నాయక్, రాంచందర్ నాయక్, శ్రీనివాస్ నాయక్, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.