అన్నపై తమ్ముడు దాడి

నల్లగొండ: నల్లగొండలో అన్నపై తమ్ముడు గొడ్డలితో దాడి చేశాడు. జిల్లా కేంద్రంలోని ప్రకాశం బజార్‌లోని చేపల మార్కెట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అన్న తాబేర్‌పై తమ్ముడు సాకీర్ దాడి చేశాడు. గాయపడ్డ తాబేర్‌ను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాకీర్ కోసం గాలిస్తున్నారు.