*అన్నా చెల్లెళ్ల అనురాగానికి ప్రతీక రక్షాబంధన్!
*లింగంపేట్ లో ఘనంగా రాఖీ పండగ
లింగంపేట్ 12 ఆగస్టు (జనంసాక్షి)
అన్నా చెల్లెళ్ల అనురాగానికి ప్రతీకైన రక్షాబంధన్ పండగను శుక్రవారం లింగంపేట్ మండలంలోని వివిధ గ్రామాల్లో రాఖీ పండుగను అక్క చెల్లెలు అన్నదమ్ములు ఘనంగా జరుపుకున్నారు.అన్న చెల్లెలు ఉన్న ప్రతి ఇంట్లో రాఖీ పండుగను జరుపుకొని రాఖీలు కట్టుకున్నారు.ఒకరికొకరు అన్నా చెల్లెల్లు ఆప్యాయతంగ అనురాగలను పంచుకో రాఖీ పండుగ నిర్వహించి సంతోషంగా ఉన్నారు. మండలంలోని పోల్కంపేట్ గ్రామంలో అక్కలు మాసుల సమీరా,అంజలీలు తమ్ములైన బన్నీ,మనీష్,అక్షిత్,లక్కీ,లకు రక్షా బంధన్ కట్టి రాఖీ పండుగను ఆనందోత్సవాల మద్య జరుపుకున్నారు.