అన్నివర్గాలు, మతాలకు ప్రాధాన్యం ఇచ్చిన పార్టీ తెదేపా

-సినీ నటుడు బాలకృష్ణ

హైదరాబాద్‌ : మహిళలకు ఆస్తిహక్కు కల్పించిన ఘనత ఎన్టీఆర్‌కు సినీనటుడు బాలకృష్ణ అన్నారు. గండిపేటలో జరుగుతున్న మహానాడులో ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించి బాలకృష్ణ ప్రసంగించారు. అన్ని వర్గాలు, మతాలకు ప్రాధాన్యం ఇచ్చిన పార్టీ తెదేపా అని తెలిపారు. అవినీతిని మేని ఫెస్టోగా, కాంగ్రెస్‌ పార్టీ మార్చిందని విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అస్తవ్యస్తంగా మారాయని మండిపడ్డారు. చంద్రబాబు తీసుకువచ్చిన సంస్కరణలు ప్రజలకు ఉపయోగపడ్డాయని కొనియాడారు. ప్రజల వద్దకు పాలన పేరుతో పారదర్శక ప్రభుత్వాన్ని చంద్రబాబు అందించారని అన్నారు.