అన్ని గ్రామాల్లో సమస్యల పరిష్కానికి చర్యలు
గజ్వేల్,మే28(జనం సాక్షి):గజ్వేల్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామం అభివృద్ధిలో ముందుకు సాగుతుందని గడ ఓఎస్డీ హన్మంతరావు అన్నారు. కొన్ని గ్రామాల్లో నెలకొన్న చిన్నచిన్న సమస్యలను తెలుసుకునేందుకు తాను పర్యటిస్తున్నట్లు తెలిపారు.ప్రతి ఇంటికి తాగునీరు సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నా మని అన్నారు. గ్రామంలో చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయవద్దని అన్నారు. గ్రామాల్లో అవసరమైన మేరకు చెత్త డంపింగ్ యార్డుకు వెంటనే స్థలాన్ని సేకరించాలన్నారు.ప్రతి ఇంటికి తాగునీటిని అందిస్తామని అన్నారు. వాటిని వెనువెంటనే పరిష్కరించేందుకు అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంచుతున్నామన్నారు.