అన్ని దానాల్లోకెల్లా అవయవ దానం అత్యున్నతమైన దని, మానవ జన్మకు మహా అవకాశమని, నేత్ర దానం తో అంధుల్లో వెలుగులు,
– అన్ని దానాల్లోకెల్లా అవయవ దానం అత్యున్నతమైన దని, మానవ జన్మకు మహా అవకాశమని, నేత్ర దానం తో అంధుల్లో వెలుగులు, అవయవదానంతో ఆరిపోయే ప్రాణాలకు ఆయుష్షును, దేహ దానంతో భావి వైద్యుల పరిశోధనలకు ఉపయోగ పడవచ్చునని,ప్రతి ఒక్కరూ అవయవదానానికి ముందుకు రావాలని తెలంగాణ నేత్ర శరీర అవయవదాతలు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పరికిపండ్ల అశోక్ పిలుపునిచ్చారు. ఆది వారం
ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామంలో సర్పంచ్ కుర్ర సాంబమూర్తి గౌడ్ అధ్యక్షతన జరిగిన నేత్ర అవయవ దానం పై జరిగిన అవగాహన కార్యక్రమంలో డాక్టర్ అశోక్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ చనిపోయిన తర్వాత అవయవాలను కాల్చడం ద్వారా బూడిద పాలు, మట్టిలో పాతడం ద్వారా మట్టిపాలు చేయకుండా అవయవ దానం చేసి చిరంజీవులుగా మిగిలి పోవాలని తెలిపారు. భారతదేశంలో పన్నెండు లక్షల మంది అంధులు ఇంతవరకు ప్రపంచాన్ని చూడలేక,నేత్ర దాతల కోసం ఎదురు చూస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు.అనంతరం పాల్గొన్న వారిచే కరపత్రాలు ఆవిష్కరణ అనంతరం -నేత్ర,అవయవ దానం చేస్తామని ప్రమానం చేయించారు, గౌరవ అతిధి గ్రామ సర్పంచి కుర్ర సాంబమూర్తి గౌడ్ మాట్లాడుతూ గ్రామస్థాయిలో అవయవ నేత్రదానంపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య మిత్ర స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి ముల్క ఐలయ్య, వైస్ ఎంపీపీ తంగెడ నగేష్ ఉప సర్పంచ్ సంకీర్తన ప్రహల్లద్.trsv మండల ఉపాధ్యక్షులు ఎంజాల కృష్ణ సాయి నెత్రుత్వం లో జరిగింది .. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఎర్రబెల్లి సంపత్ రావు, , సోషల్ మీడియా మండల అధ్యక్షుడు గుండేటి సతీష్, సింగన బోయిన ఐలయ్య, సూరారం గ్రామ అధ్యక్షులు మేకల బాబు, ఎంజాల శివ, మేకల అరుణ్ తదితరులు పాల్గొన్నారు.