అన్ని పార్టీల ఎల్పీ నేతలతో రేపు భేటీ

హైదరాబాద్

శాసన సభలో నిన్న జరిగిన పరిణామాలపై చర్చించేందుకు అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్ రేపు ఉదయం సమావేశం ఏర్పాటు చేశారు. ఉభయ సభల్లో అన్ని పార్టీల శాసనసభా పక్ష నేతలతో ఉదయం 9 గంటలకు అసెంబ్లీ స్పీకర్ మధుసూదన చారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్ సమావేశమవుతారు. సభ్యుల ప్రవర్తన, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించే అవకాశం ఉంది.