అన్ని ప్రైవేటు యూనివర్సిటీలలో రిజర్వేషన్లను అమలు చేయాలి.

బీసీ విద్యార్థి యువజన పోరు యాత్రను విజయవంతం చేయండి.                            -బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్.

-పోరు యాత్ర వాల్ పోస్టర్లు విడుదల.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,నవంబర్ 28( జనంసాక్షి):
బీసీ విద్యార్థి యువజనుల హక్కులను సాధించుకునేందుకు డిసెంబర్ 3న నిర్వహించే  బిసీ విద్యార్థి యువజన  పోరుయాత్రను విజయవంతం చేయాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు ఈడిగ శ్రీనివాస్ గౌడ్ బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శి సింగం నాగేష్ గౌడ్ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గొడుగు మహేష్ యాదవ్ లు కోరారు.సోమవారం  జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ విద్య సామాజిక న్యాయం కోసం రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి యువజనులను జాగృతం చేసేందుకు జనవరి 8వ తేదీ వరకు 33 జిల్లాలు 80 నియోజకవర్గాలలో పోరు యాత్రలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. గత మూడు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం బకాయి ఫీజులను విడుదల చేయకపోవడం వల్ల పేద మధ్యతరగతి విద్యార్థులు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని. ఫీజులు చెల్లిస్తేనే ధ్రువపత్రాలు అందజేస్తామని ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు ఒత్తిడి చేయడం వల్ల ఉన్న చదువులు చదివే అవకాశం కోల్పోతున్నారని మండిపడ్డారు. ప్రైవేటు యూనివర్సిటీలలో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు.సంక్షేమ వసతి గృహాలలో మెస్ చార్జీలు పెంచకపోవడం సొంత భవనాలు లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే బీసీలకు రిజర్వేషన్లను పెంచాలని ప్రత్యేక మంత్రిత్వ శాఖను కేటాయించాలని డిమాండ్ చేశారు.మూడున నిర్వహించే పోరు యాత్రకు రాజకీయ పార్టీలకతీతంగా బీసీలంతా కలిసి రావాలని కోరారు.ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు అనిల్ కుమార్ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ యాదవ్ నాయకులు శాంత కుమార్ గౌడ్ రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.