అన్ని హాస్టళ్లలో బీఫ్ ఫెస్టివల్ ప్రారంభం
హైదరాబాద్ : ఓయూలోని అన్ని హాస్టళ్లలో బీఫ్ ఫెస్టివల్ ప్రారంభమైంది. నిర్బంధం నడుమే విద్యార్థులు హాస్టల్ గదుల్లో పరస్పరం బీఫ్ తినిపించుకున్నారు. ఎన్‌ఆర్‌ఎస్ హాస్టల్లో విద్యార్ధులు పెద్ద ఎత్తు బీఫ్ ఫెస్టివల్‌లో పాల్గన్నారు. నిర్బంధం కారణంగా ప్రణాళికా బద్ధంగా ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నట్లు ప్రజాస్వామ్య సాంస్కృతిక వేదిక ప్రతినిధులు తెలిపారు. తమ హక్కులను కాలరాయొద్దని ఈ సందర్భంగా డీసీఎఫ్ పేర్కొంది. ఇదిలా ఉంటే బీఫ్ ఫెస్టివల్‌ను అడ్డుకునేందుకు వస్తున్న గోరక్షణ సమితి మహిళా కార్యకర్తలను పోలీసులు ఓయూ ప్రధాన ద్వారం వద్దే అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు.