అన్నోజిగూడాలో పోలీసుల తనిఖీలు
మేడ్చల్,మే22(జనం సాక్షి ): ఘట్కేసర్ పరిధి అన్నోజిగూడలో పోలీసులు నిర్భంద తనిఖీలు నిర్వహించారు. మల్కాజ్గిరి డీసీపీ ఉమా మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో 350 మంది పోలీసులు కట్టడి ముట్టడి(కార్డన్ సెర్చ్)లో పాల్గొన్నారు. సరైన పత్రాలు లేని 44 ద్విచక్రవాహనాలు, 7 ఆటోలు, ఒక ట్రాక్టర్, 13 సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. 14 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ తనిఖీల్లో ఏసీపీ సందీప్, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.