అపూర్వ సమ్మేళనం-సందడిగా అపూర్వ విద్యార్థుల పలకరింపులు
ఎల్బీ నగర్ (జనం సాక్షి )పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో మిర్యాలగూడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సందడి నెలకొంది . కళాశాలలో విద్యను అభ్యసించిన విద్యార్థుల 1987బ్యాచ్ కు చెందిన విద్యార్థులు .కళాశాలలో వేదికకు చేరుకుని ఆత్మీయ పలకరింపులు, కుశల ప్రశ్నలు సంధించుకొని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు . మూడున్నర దశాబ్దాల క్రితము తమకు పాఠాలు బోధించిన అధ్యాపకులను తమకు తామే పరిచయం చేసుకొని ఘనంగా సన్మానించి వారి ఆశీర్వాదం తీసుకున్నారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గా హాజరైన ఆనాటి లెక్చరర్లు రామారావు ,రామచంద్రయ్య, ధనుంజయ లు మాట్లాడుతూ 35 సంవత్సరాల క్రితమే విద్యను అభ్యసించిన విద్యార్థులు ను ఈ విధంగా ఒకే వేదిక మీద కలవడం సంతోషంగా ఉందని అన్నారు .తాము ముందుగా ఊహించినట్లుగానే క్రమశిక్షణ పాఠ్యాంశాలపై శ్రద్ధవహించిన అప్పటి విద్యార్థులు కొందరు ఉన్నత స్థానాల్లోకి చేరి నలుగురికి ఆదర్శంగా సహాయకారులుగా ఉండటం అభినందనీయమని అన్నారు .తమకు జరిగిన ఈ సన్మానం చిరస్మరణీయంగా గుర్తుండి పోతుందని స్పష్టం చేశారు . కళాశాలలో మౌలిక సదుపాయాల కోసం 1987 బ్యాచ్కు చెందిన విద్యార్థులు రూ. 70 వేల రూపాయలు కళాశాల అభివృద్ధి కోసం అందించడము హర్షణీయమని అన్నారు .ఇంకా పలు సామాజిక సేవా కార్యక్రమాలలో ప్రత్యక్ష భాగస్వాములు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు తాడోజు సత్యనారాయణ, వెగ్గళం శ్రీనివాస్, హేమ కుమార్, కుంచకూరి వెంకటేశ్వర్లు ,రంగ శ్రీనివాస్,కొనుగోటి రామకృష్ణ రాజు,గొల్ల శ్రీనివాస్, హనుమంత్ రావు,ఐ.సుధాకర్ రెడ్డి, పుట్నామ్ రామ్ కమల్, తిప్పర్తి రమణారెడ్డి,గౌరు ప్రభాకర్,శ్రీరామ్ యాదగిరి,జామలాపూర్ శంకర్,పి. యాదగిరి, చిలుకూరి శ్రీనివాస్,నెల్లిమర్ల శ్రీనివాసరావు,కట్టేబోయిన లక్ష్మన్ ,బ్రహ్మచారి,గోపాల కృష్ణ,వజ్రం సత్యనారాయణ,చిట్టిప్రోలు సత్యనారాయణ,మారోజు స్వామి,శ్రవణ్ కుమార్, మట్టి కొండయ్య, వై. సత్యనారాయణ ,రంగా భవాని, కిరణ్ కుమారి, రమాదేవి , శోభారాణి తదితరులు పాల్గొన్నారు.