అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
మనూరు(మెదక్): అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని శెల్గిరలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన దానం మల్లారెడ్డి (31) అప్పుల బాధ భరించలేక జీవితంపై విరక్తి చెంది శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడన్నారు. ఈ విషయాన్ని గమనించి చికిత్స నిమిత్తం నారాయణఖేడ్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా పరిస్థితి విషమించడంతో హైదరా బాద్‌లోని గాంధీ ఆసుపత్రికి రెఫర్ చేశారు. గాంధీలో చికిత్స పొందుతూ మృతి చెందాడని తెలిపారు. మృతుడికి భార్య ముగ్గురు పిల్లలున్నారని, మృతుడి కుటంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరారు.