అఫ్గనిస్తాన్‌లో భారత్ మూడవ దశ ప్రాజెక్టులు
న్యూఢిల్లీ : కల్లోలిత అఫ్గనిస్తాన్‌లో 100 మిలియన్ డాలర్ల విలువైన లఘుపరిశ్రమల ఏర్పాటుకు సమ్మతించింది. ఇందుకు వంద డాలర్లు వ్యయమవుతాయని ఆర్థిక మంత్రి పి.చిదంబరం విలేకరులకు తెలిపారు. వచ్చేవారం ఆఫ్గన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ భారత్ పర్యటనకు వస్తున్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం తదితర రంగాలలో స్థానికులు స్వావలంబన సాధించేందుకు మౌలిక సదుపాయాల కల్పనకు ఈ మొత్తాన్ని వినియోగిస్తారని చెప్పారు. మొత్తం 34 ప్రానిన్స్‌లో ఈ ప్రాజెక్టులు చేపడతారని చెప్పారు. మొదటి దశలో 11,216,179 డాలర్ల విలువైన ప్రాజెక్టులను, రెండవ దశలో 8,579,537 డాలర్ల విలువైన ప్రాజెక్టులను చేపట్టింది. రెండు దశలలోను ప్రాజెక్టులు చాలావరకు పూర్తి అయ్యాయని పేర్కొన్నారు. నవంబర్ 9-12 తేదీలలో కర్జాయ్ ఇక్కడ పర్యటిస్తారు. ప్రధానితో విస్తృత చర్చలు జరుపుతారు. ఈ ప్రాజెక్టులలో పనిచేసే భారతీయుల భద్రత, దేశ సెక్యూరిటీ తదితర అంశాలపై చర్చిస్తారు. అఫ్గనిస్తాన్‌కు మానవతావాదంతో పలు రంగాలలో ఇతోదిక సాయం చేస్తోంది.