అఫ్జల్‌గురుకు ఉరిశిక్ష అమలు

అత్యంత గోప్యంగా తీహార్‌ జైలులో ఉరి
అక్కడే ఖననం
కాశ్మీర్‌లో కర్ఫ్యూ , నిరసన ప్రదర్శనలు
దేశవ్యాప్తంగా హై అలర్ట్‌
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9 (జనంసాక్షి) :
పార్లమెంట్‌పై ఉగ్రవాదుల దాడికి సూత్రదారిగా పేర్కొన్న అఫ్జల్‌గురును శనివారం ఉరితీశారు. పార్లమెంట్‌పై దాడికేసులో కీలక దోషిగా పేర్కొంటూ అప్జల్‌గురుకు ఉదయం ఎనిమిది గంటలకు తీహార్‌ జైలులో ఉరిశిక్షను అమలుచేశారు. అత్యంత నాటకీయంగా, గోప్యంగా ఉదయం ఆయనను ఉరి తీశారు. దీనికి సంబంధించి శుక్రవారమే తతంగమంతా పూర్తి చేసినా వివరాలు బయటకు పొక్కనీయలేదు. అంతేగోప్యంగా తీహార్‌ జైలులోనే అతడి మృతదేహాన్ని ఖననం చేశారు. అతన్ని ఉరితీసిన ప్రదేశానికి సమీపంలోని జైల్‌ నం. 3 వద్ద మృతదేహాన్ని ఖననం చేసినట్లు జైలు అధికారులు తెలిపారు. అధికారుల ఆదేశాల మేరకు జైల్లోనే ఈ పక్రియ పూర్తి చేశామన్నారు. ముంబయి దాడుల కేసులో పాకిస్థాన్‌ ఉగ్రవాది అజ్మల్‌ కసబ్‌కు ఉరి అమలయ్యాక ఇక అఫ్జల్‌గురుకు కూడా ఏదో ఒకరోజు ఉరి ఖాయమని అందరూ భావించారు. ఆ విధంగా సంకేతాలు కూడా అందాయి. దాదాపు 11 ఏళ్ల తరవాత దోషిగా ప్రకటించిన అప్జల్‌గురుకు శిక్షను అమలు చేశారు. అత్యంత గోప్యంగా కసబ్‌ను ఉరితీసినట్లే కసబ్‌ను ఉరితీశారు. ఉదయం 8 గంటలకు అతన్ని తీహార్‌ జైల్లో ఉరి తీసినట్లు ¬ంశాఖ సమాచారం ఇచ్చింది. ఉరితీసిన అనంతరం కేంద్ర ¬ంశాఖ అధికారిక ప్రకటన వెలువరించింది. దీంతో దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. ఆయన స్వరాష్ట్రం కాశ్మీర్‌లో కర్ఫ్యూ విధించారు. ఎలాంటి ఘటనలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకున్నారు. అఫ్జల్‌గురుపెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ తిరస్కరించారు. దాంతో అఫ్జల్‌గురుకు ఉరిశిక్ష

అమలు చేశారు. గత నెలలోనే అఫ్జల్‌గురు ఉరిశిక్ష అమలుకు కేంద్ర ¬ం శాఖ సిఫారసు చేసింది. ఉదయం ఉరిశిక్ష అమలు నేపథ్యంలో శుక్రవారం రాత్రే అఫ్జల్‌గురును తీహార్‌ జైలుకు తీసుకువచ్చారు. 2001లో పార్లమెంట్‌పై దాడి కేసులో అప్జల్‌గురు ప్రధాన నిందితిడు. అతడికి 2004లో సుప్రీం కోర్టు ఉరిశిక్షను విధించింది. 2006లో అతను క్షమాభిక్ష పిటిషన్‌ దాఖలు చేయడంతో ఉరిశిక్ష అమలు నిలిచిపోయింది. అయితే 2013, ఫిబ్రవరి 3న అప్జల్‌గురు క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించినట్లు సమాచారం. దీంతో శనివారం ఉదయం అతనికి ఉరిశిక్షను అమలు చేశారు. అప్జల్‌కు ఉరిశిక్ష అమలు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జమ్మూకాశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. 2001 డిసెంబర్‌ 13న ఉగ్రవాదులు పార్లమెంటుపై చేసిన ఉగ్రదాడిలో ఏడుగురు భద్రతా సిబ్బంది మరణించగా మరి కొందరు గాయపడ్డారు. వీరంతా ఉగ్రవాదులతో పోరాడి మరణించినవారే. ఈ దాడికి అఫ్జల్‌గురు ప్రధాన సూత్రధారిగా అభియోగాలు నమోదు చేశారు. అఫ్జల్‌గురుకు ఉరిశిక్ష అమలు చేయడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జమ్మూ కాశ్మీర్‌ అంతటా కర్ఫ్యూ విధించారు. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో కూడా హై అలర్ట్‌ విధించారు.
అత్యంత గోప్యంగా ఉరిశిక్ష పక్రియ పూర్తి
ముంబయి దాడుల ఘటనలో అజ్మల్‌ కసబ్‌ను ఉరి తీసిన విధంగానే పార్లమెంట్‌పై దాడి కేసులో కీలక దోషి అప్జల్‌గురుకు కూడా అత్యంత రహస్యంగా ఉరిశిక్ష పక్రియను పూర్తిచేశారు. రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరణ నుంచి ఉరిశిక్ష అమలు వరకూ కేంద్ర ¬ంశాఖ అన్ని విషయాలను అత్యంత గోప్యంగా ఉంచింది. శనివారం ఉదయం తీహార్‌ జైల్లో ఉరి అమలు అనంతరం మీడియాకు విషయాన్ని వెల్లడించింది. అంతవరకు ఎక్కడా ఈ విషయం గురించి ఎవరికి తెలియకపోవడం విశేషం.
దేశవ్యాప్తంగా భద్రత పెంపు
భారత పార్లమెంట్‌పై దాడి కేసులో కీలక దోషి అప్జల్‌గురు క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించిన నేపథ్యంలో కాశ్మీర్‌లో పోలీసులు కర్ఫ్యూ విధించారు. అప్జల్‌గురు జమ్మూకాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాకు చెందినవాడు. దీంతో శ్రీనగర్‌తోపాటు పలు ప్రాంతాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అక్కడ ఎలాంటి ఘటనలకు తావులేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ప్రముఖులకు భద్రత పెంచారు. ఉరిశిక్ష అమలు చేసిన నేపథ్యంతో దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. దేశరాజధాని ఢిల్లీలో భద్రతను పెంచారు. హైదరాబాద్‌, బెంగళూరులలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది.
జమ్మూకాశ్మీర్‌లో ఆందోళనలకు పిలుపు
అప్జల్‌గురుకు ఉరిశిక్ష అమలుపై జమ్మూకాశ్మీర్‌లోని వేర్పాటు వాదులు మండిపడ్డారు. ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలని కోరినా పట్టించుకోలేదని నేషనల్‌ కాన్ఫరెన్స్‌, హురియత్‌ కాన్ఫరెన్స్‌ నేతలు ఆక్షేపించారు. ప్రభుత్వ చర్యకు నిరసనగా జమ్మూకాశ్మీర్‌లో 4 రోజులపాటు ఆందోళనలు, బంద్‌కు పిలుపునిచ్చినట్లు తెలిపారు.
దాడి జరిగిన 11 ఏళ్లకు ఉరిశిక్ష అమలు..
భారత సార్వభౌమత్వానికి ప్రతీక అయిన పార్లమెంట్‌పై దాడి దేశ చరిత్రలోనే ఓ మాయని మచ్చ. 2001 డిసెంబర్‌ 13న ఐదుగురు దుండగులు పార్లమెంట్‌ భవనంలోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులకు జరిపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో 9 మంది మృత్యువాతపడ్డారు. ఇందులో ఎక్కువగా పార్లమెంట్‌ భద్రతా సిబ్బందే ఉన్నారు. అనంతరం భద్రతాసిబ్బంది వీరోచితంగా పోరాడి ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. అప్పటి ఉప ప్రధాని అద్వానీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, పలువురు సభ్యులు ఆ సమయంలో పార్లమెంట్‌ భవనంలోనే ఉన్నారు. అంతకు కొద్దిసేపు క్రితమే ప్రధాని వాజపేయి, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ పార్లమెంట్‌ నుంచి బయటకు వచ్చారు. ఈ దాడికి కీలక సూత్రధారిగా పేర్కొంది. ఆయనను జైషేమహ్మద్‌ ఉగ్రవాదిగా ప్రకటించింది. 2004లో సుప్రీంకోర్టు ఈ కేసులో అప్జల్‌కు ఉరిశిక్షను విధించింది. అయితే 2006లో అతను క్షమాభిక్ష దాఖలు చేశాడు. క్షమాభిక్ష పిటిషన్‌ సుదీర్ఘ కాలం రాష్ట్రపతి భవన్‌లో పెండింగ్‌లో ఉండటంతో ఉరిశిక్ష అమలులో జాప్యం జరుగుతూ వచ్చింది. 2013 ఫిబ్రవరిలో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించడంతో తీహార్‌ జైల్లో ఉరిశిక్షను అమలు చేశారు.