అబద్దాల సామ్రాట్‌ చంద్రబాబు

నాలుగేళ్ల పాలనలో అన్ని వర్గాలు సర్వనాశనం అయ్యాయి
మోదీ, చంద్రబాబు దొందూదొందే
నాలుగేళ్ల పాలనపై వైసీపీ ఛార్జిషీట్‌పై చర్చకు సిద్ధమా
వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం
విజయవాడ, జూన్‌8(జ‌నం సాక్షి) : అరాచకాలకు ప్రతిరూపం, అవినీతికి విశ్వరూపం సీఎం చంద్రబాబు పాలన అని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం విమర్శించారు. శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యలయంలో మల్లాది విష్ణు, జోగిరమేశ్‌, వెల్లంపలిశ్రీనివాస్‌, సుధాకర్‌ బాబు,అప్పిరెడ్డి, భవకుమార్‌లతో కలసి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు గత నాలుగేళ్ల పాలనపై ఛార్జీషీట్‌ను విడుదల చేశారు. అన్యాయాలు సామ్రాట్‌, అబద్ధాల విరాట్‌ చంద్రబాబు అని తమ్మినేని సీతారం మండిపడ్డారు. 4 ఏళ్ల పాలనలో రుణమాఫీ విషయంలో చంద్రబాబు మాట తప్పారని, తొలిసంతకానికి విలువ లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హావిూ నెరవేర్చని ప్రభుత్వం ఇదని , అందుకే టీడీపీ మ్యానిఫెస్టోను మాయం చేశారని ఆరోపించారు. అవినీతిలో నెంబర్‌ 1 పాలన అని, ప్యాకేజీలు దండుకోడానికే కేంద్రం నుంచి ప్రాజెక్టులు తీసుకోలేదా అని ప్రశ్నించారు. నీరు చెట్టు పేరుతో పందికొక్కుల్లా దోచుకుతిన్నది వాస్తవం కాదా అని నిలదీశారు. 4ఏళ్లుగా రాష్టాన్రికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాజ్యాంగ వ్యవస్థలను సర్వనాశనం చేశారని, నవ నిర్మాణ దీక్ష కాదని, నయవంచన దీక్ష అని ఎద్దేవ చేశారు. ప్రభుత్వం ఐసీయూలో ఉందని, లక్షల కోట్ల ఒప్పందాలు ఏమయ్యాయని, వీటిపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబుకు సిగ్గుంటే ఫిరాయింపు నేతలతో రాజీనామా చేయించాలన్నారు. బాబు ఓ రాజకీయ వ్యభిచారని, ఆయనంత అసమర్థ సీఎం ఎవరూ లేరని దుయ్యబట్టారు. ఎన్టీఆర్‌ సుజల స్రవంతి’ కాదని, అది నారా వారి సారా స్రవంతి అని ఎద్దేవా చేశారు. తమ ఛార్జీషీట్‌ను ఖండించగలరా అని సవాల్‌ విసిరారు. బాబు పాలనలో అన్ని వర్గాలు సర్వనాశనం అయ్యాయని, రాష్టాన్ని సర్వనాశనం చేసినందుకు నవనిర్మాణ దీక్ష చేస్తున్నారా అని జోగి రమేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు వంటి అసమర్థున్ని ఎన్నుకున్నాం అని ప్రజలు బాధపడుతున్నారని, మోదీ, బాబు ఇద్దరూ దొందూ దొందే, ఇద్దరిని ప్రజలు చీకొట్టే రోజు త్వరలోనే వస్తుందని మల్లాది విష్ణు అన్నారు. చంద్రబాబు ప్రజలకు గుర్తుండే కార్యక్రమం ఒక్కటి అయినా ఈ 4 ఏళ్లలో చేశారా అని సుధాకర్‌ బాబు ప్రశ్నించారు. అన్నం పెట్టే రైతుకు సున్నం పెట్టిన ఘనత చంద్రబాబుది అని మండిపడ్డారు. మంత్రి
యనమల తమ ఛార్జీషీట్‌పై బహిరంగ చర్చకు సిద్ధమా అని ఆయన్‌ సవాల్‌ విసిరాడు. 4 ఏళ్ల పాలనలో దళితులకు తీవ్ర అన్యాయం జరిగిందని, బాబు చేపట్టిన నవనిర్మాణ దీక్ష కాదు నవ నాశన దీక్ష అని ఎద్దేవ చేశారు.