అబ్దుల్లాపూర్‌మెట్‌లో చోరీ
రంగారెడ్డి : హయత్‌నగర్ మండలం అబ్దుల్లాపూర్ మెట్‌లో ఓ దుకాణంలో చోరీ జరిగింది. నిన్న రాత్రి దుకాణం తలుపులు బద్దలు కొట్టి దొంగలు లోనికి ప్రవేశించి భారీగా బంగారం, వెండి నగలను దోచుకెళ్లినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు క్లూస్ టీంతో ఘటనాస్థలికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.