అబ్దుల్ కలాం సేవలు చిరస్మనీయం – నేషనల్ హ్యూమన్ రైట్స్ అధ్యక్షుడు మంగళపల్లి హుస్సేన్.
తొర్రూరు 15 అక్టోబర్( జనంసాక్షి )
మాజీ రాష్ట్రపతి,అనుశాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన పితామహుడు ఏపీజే అబ్దుల్ కలాం సేవలు చిరస్మనీయమని,నేషనల్ హ్యూమన్ రైట్స్ అధ్యక్షుడు మంగళపల్లి హుస్సేన్ అన్నారు.అబ్దుల్ కలాం 91వ జయంతి సందర్భంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ తొర్రూరు మండల కమిటీ ఆధ్వర్యంలో శనివారం పట్టణ కేంద్రంలోని విశ్రాంతి భవనంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంగళపల్లి హుస్సేన్ పాల్గొని,అబ్దుల్ కలం చిత్రపటానికి పూలమాలలు,వేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.భారత దేశంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి ఊపిరి పోసి భవిష్యత్ తరాల వారికి స్ఫూర్తినిచ్చిన మహనీయుడు అబ్దుల్ కలామని,ఒక సామాన్య కుటుంబంలో జన్మించి,భారత రాష్ట్రపతి అత్యున్నతమైన పదవిని అలంకరించిన గొప్ప మహానీయుడని కొనియాడారు.భారతరత్నతోపాటు ప్రపంచ దేశాలకు గడగడ లాడించి రాకెట్స్ తయారుచేసి భారతదేశం గొప్పతనం ప్రపంచ దేశాలకు చాటిచెప్పిన నవభారత నిర్మాత అని,ఎంతోమంది పేద విద్యార్థుల వారి ఆలోచన విధానంలో మార్పు తీసుకొచ్చిన ఘనత కేవలం అబ్దుల్ కలాంకే దక్కుతుందన్నారు.ప్రతి విద్యార్థి అబ్దుల్ కలాంను స్ఫూర్తిగా తీసుకొని సమాజ శ్రేయస్సుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో తొర్రూరు డివిజన్ ప్రెసిడెంట్ పల్లెర్ల రమేష్,మండల ప్రెసిడెంట్ ఉమేష్,రాష్ట్ర ట్రెజరీ శ్రీరామ్ నవీన్,పాలకుర్తి నియోజకవర్గ జాయింట్ సెక్రెటరీ రాజశేఖర్,గంధం లాలయ్య,గార వీరస్వామి,మండల కమిటీ సభ్యులు నరేష్,ఏకమల్లు,వెల్తూరి పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు.