అభయాంజనేయ స్వామి వద్ద మహా అన్నదానం

అభయాంజనేయ స్వామి వద్ద మహా అన్నదానం
టేకులపల్లి, ఏప్రిల్ 3( జనం సాక్షి): నెహ్రు నగర్ రాతి చెరువు పాఠశాల ఎదురుగా ఉన్నటువంటి శ్రీఅభయాంజనేయ స్వామి విగ్రహం వద్ద  శ్రీరామనవమి వేడుకలు విజయవంతమైన సందర్భముగా సోమవారం మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని బి.ఆర్.ఎస్ జిల్లా నాయకులు దాసరి నాగేశ్వరరావు,  బండి వెంకటేశ్వర్లు చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఈ మహానదానాన్ని  భక్తులు సుమారు 500 మంది హాజరై స్వీకరించారు.