అభివృద్దిని చూసి టిఆర్‌ఎస్‌లో చేరుతున్నారు: మాజీఎమ్మెల్యే మదన్‌రెడ్డి 

మెదక్‌,అక్టోబర్‌16(జ‌నంసాక్షి): అభివృధిని చూసి కాంగ్రెస్‌, ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గూలాబీ పార్టీలోకి వలస వస్తున్నారని మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పేర్కొన్నారు. టిఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని అన్నారు.  పార్టీలోకి వచ్చిన కార్యకర్తలకు ఎమ్మెల్యే కండువాలు కప్పి ఆహ్వానించారు.  గత ప్రభుత్వాల పాలనలో తెలంగాణలో విద్యా రంగాన్ని నిర్లక్ష్యం చేశారని, దీంతో మన పిల్లలు విద్యలో వెనుకబడి, ఉద్యోగాలు రాకుండా కుట్రలు చేశారని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ అధికారం చేపట్టగానే విద్యారంగానికి పెద్దపీట వేసి, వందల సంఖ్యలో రెసిడెన్షియల్‌ పాఠశాలలను ప్రారంభించినట్లు ఎమ్మెల్యే మదన్‌రెడ్డి స్పష్టం చేశారు.మత్స్యకారుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ అహర్నిశలు కృషి చేస్తున్నారని నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు.