అభివృద్దిలో తెలంగాణ నంబర్‌వన్
ప్రజలకు జోగురామన్న పిలుపు
ఆదిలాబాద్,అక్టోబర్1(జనంసాక్షి): అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్‌గా నిలిచిందని మంత్రి జోగు రామన్న అన్నారు. రాష్ట్రాన్ని దోచుకున్న కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్రానికి అడ్డుపడ్డ టీడీపీ ఏకమై ప్రజల ముందుకు వస్తున్నాయన్నారు. వీటిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపసునిచ్చారు. అన్ని పార్టీలు కూటమి కట్టినా టిఆర్‌ఎస్‌తో పోటీ పడలవేన్నారు. ప్రజలకు అభివృద్ది కావాలన్నారు. ప్రచారంలో భాగంగా సోమవారం పలువురు మంత్రిని కలసి అభినందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీల పరిపాలన ఎలా ఉందో చూశామన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను విస్మరించి ఎన్నికలు రాగానే ప్రజలపై కపట ప్రేమ కనబరుస్తున్నారన్నారు. వారి మాయ మాటలు నమ్మి ఓటేస్తే రాష్ట్రాన్ని అంధకారంలోకి తీసుకెళ్తారన్నారు. ఇన్ని సంవత్సరాలు వాళ్లు చేసిన పాపాలను సీఎం కేసీఆర్ నాలుగేళ్లలోనే కడిగేశారన్నారు. అందుకే ఆ పార్టీల నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలన్నారు. వారికి అధికార దాహం, పదవీ కాంక్ష తప్ప ప్రజల సమస్యలను పట్టించుకోవాలన్న చిత్తశుద్ధి లేదన్నారు. పట్టణంలో ఏ
ప్రభుత్వ హయాంలో జరగని అభివృద్ధి టీఆర్‌ఎస్ పాలనలోనే జరిగిందన్నారు. త్వరలో టీఆర్‌ఎస్ పార్టీ మేనిఫెస్టో ను ప్రకటించబోతున్నామన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా విలువైనదని, దాంతో విమర్శకులకు తగిన గుణపాఠం చెప్పాలని రాష్ట్ర మంత్రి జోగు రామన్న అన్నారు. పేదల గురించి గత ప్రభుత్వాలు ఏనాడూ ఆలోచించలేదన్నారు. అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల పక్షపాతిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. రాబోయే కాలంలో విపక్షాల విమర్శలకు తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఆసన్నమైందన్నారు.