అభివృద్ది,సంక్షేమంలో ముందున్నాం: ఎమ్మెల్యే
మహబూబాబాద్,డిసెంబర్2(జనంసాక్షి): జిల్లాలో సంక్షేమ,అభివృద్దికార్యక్రమాఉల సక్రమంగా
సాగుతున్నాయని,వీటిని చూడలేని కాంగ్రెస్ తదిర పార్టీల వారు విమర్శలు చేస్తున్నారని మానుకోట ఎమ్మెల్యే శంకర్‌నాయక్ అన్నారు. నిరుపేదల అభివృద్ధే సర్కారు ధ్యేయమని మానుకోట ఎమ్మెల్యే శంకర్‌నాయక్ అన్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం శరవేగంగా సాగుతోందని, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందుతున్నాయని అన్నారు.ఆసరా, రుణ మాఫీ, గురుకు లాల ఏర్పాటు, మధ్యాహ్న భోజనం, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, డబుల్ బెడ్‌రూం ఇండ్లు, నిరుపేదలకు భూ పంపిణీ, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇలా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పకడ్బందీగా అమలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందేలా కార్యకర్తలు పని చేయాలని సూచించారు. ఉమ్మడి పాలనలో వివక్షకు గురైన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తరవాతనే అభివృద్ధిలో ముందున్నదని అన్నారు. పోరాడి సాధించు కున్న ప్రత్యేక రాష్టాన్న్రి బంగారు తెలంగాణగా మార్చడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. కాళేశ్వరం పూర్తయితే విపక్షాలకు పుట్టగతులుండవని ప్రాజెక్ట్‌ను అడ్డుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నది నిజం కాదా అని అన్నారు. మూడేళ్లలోనే 47వేల ఉద్యోగాలను భర్తీ చేశామని, మరో 80వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సుముఖంగా ఉందని అన్నారు. మరో పదిహేనేళ్ల వరకు టీఆర్‌ఎస్ సర్కారే రాష్ట్రంలో అధికారంలో ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ తండాలను పంచాయతీలు ఎందుకు చేయలేదని, ఎస్టీలకు ఉచిత విద్యుత్ ఇవ్వలేదెందుకని, రిజర్వేషన్ల అమలుకు ఎందుకు శ్రీకారం చుట్టలేదని మండిపడ్డారు. స్వరాష్ట్రంలో నేడు నిరంతరం కరెంట్ ఉంటుందన్నారు. గృహాలకు, వ్యవసాయ రంగానికి తిప్పలు తప్పాయని అన్నారు. 24 గంటల కరెంట్‌తో రైతు బాంధవుడిగా సీఎం కేసీఆర్ నిలిచారన్నారు. రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరేనని గుర్తుచేశారు. వచ్చే వానాకాలం పంటలకు ఎకరాకు రూ.8వేలు అందివ్వనున్నట్లు చెప్పారు. సాగు నీటి కోసం ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందించారు. ప్రాజెక్టులను అడ్డుకోవడానికి కాంగ్రెస్ నేతలు కుట్రలు చేస్తున్నారని అన్నారు.