అభివృద్ది కోసం అహర్నిశలు కృషి: డిప్యూటి స్పీకర్
మెదక్,సెప్టెంబర్5(జనం సాక్షి): అనేక అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల కోసం అహర్నిషలు కృషి చేస్తోందని శాసనసభ ఉప సభాపతి పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. 24 గంటలు కరెంట్, పెట్టుబడి, బీమా వంటి పలు పథకాలతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతు సర్కారుగా నిలిచిందని చెప్పారు. మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలంలో ఆమె పర్యటించారు. చిన్న శంకరంపేట, బాగిర్తిపల్లి, రుద్రారం గ్రామాల్లో డబుల్ బెడ్ రూం ఇళ్లు, రోడ్ల నిర్మాణానికి ఆమె శంకుస్థాపనలు చేశారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కులు అందజేశారు.



