అభివృద్ది కోసమే టిఆర్‌ఎస్‌లో చేరికలు: నాయిని

మెదక్‌,జూలై4(జ‌నం సాక్షి ): అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. మెదక్‌ జిల్లాలోని నర్సాపూర్‌ నియోజకవర్గం కొల్చారం మండలం రంగంపేట్‌ సింగిల్‌ విండో ఛైర్మన్‌ మల్లేశం ¬మంత్రి నాయిని సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. మల్లేశంతో పాటు వందమంది కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. ¬ంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి సమక్షంలో వీరంతా పార్టీలో చేరారు. గులాబీ కండువాలు కప్పి నాయిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి నాయిని మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడ్డ తరవాత అనేక సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలతో దూసుకుని పోతోందని, టిఆర్‌ఎస్‌కు తిరుగు లేదని అన్నారు. అందుకే వివిధ పార్టీల్లో ఉన్న వారు అభివృద్దిని కాంక్షిస్తూ టిఆర్‌ఎస్‌లో చేరుతున్నారని అన్నారు. సిఎం కెసిఆర్‌ నాయకత్వంలో తెలంగాణ ఎన్నో మైలురాల్లను అధిగమించిందన్నారు. వ్యవసాయం విప్లవాత్మక మార్పులకు కెసిఆర్‌ శ్రీకరాం చుట్టారని అన్నారు. రాషట్‌రంలో కరెంట్‌ కొరత లేకుండా చేసిన ఘనత కెసిఆర్‌దన్నారు.