అభివృద్ది పనులపై ఎన్నికల కోడ్
నల్లగొండ,మార్చి1(జనంసాక్షి): వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ అయిన నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించేలా ఇంజినీరింగ్ శాఖలు ఎటువంటి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయొద్దని సూచించారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో పలు సూచనలు చేశారు. ఈ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ పక్రియ ప్రారంభమైందని 5 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చన్నారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ పరిధిలో జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా వివిధ అంశాలపై నోడల్ అధికారులను నియమిస్తున్నామని తెలిపారు. పర్యవేక్షక అధికారులు మండలంలో పోలింగ్, ఇతర ఎన్నికల అంశాలపై పర్యవేక్షణ చేయాలని, అన్ని పోలింగ్ స్టేషన్లలోనూ మరమ్మతులు చేసి టాయిలెట్ సౌకర్యం కల్పించాలన్నారు.