అభివృద్ధికి ఆమడ దూరంలో గాంధీ నగర్ కాలిని

-జనగామ,హుస్నాబాద్ వెళ్లే రహదారిలో

-పట్టణంలోని 9వ వార్డులో గల అపార్ట్మెంట్ కాలిని

జనగామ,(జనం సాక్షి)అక్టోబర్20:
జనగామ పట్టణంలోని 9 వార్డులో గల జనగామ, హుస్నాబాద్ వెళ్లే రహదారిలో ఉన్నటువంటి అపార్ట్మెంట్ నుండి చిటకోడూరు వెళ్లే దారి కొద్దిపాటి వర్షంకే గుంతలమయం అయి వాహనాలు రాకపోకలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది.ఈ దారి గాంధీ నగర్ లో గల అపార్ట్ మెంట్స్ బీడీ కాలిని,ఎస్సి కాలినిలకు వెళ్లే ప్రధాన మార్గం.అదేవిధంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్ మరమ్మతుల కొరకు వెళ్లే దారి కావడంతో వివిధ బారి వాహనాలు ఈ దారి గుండా వెళ్ళడం నిత్యం జరుగుతుంది. ఈ ప్రధాన రహదారి మట్టి దారి కావడం వలన వస్తున్న వర్షం కారణంగా వాహనాలు వెళ్లలేని పరిస్థితి కనబడుతోంది.అదేవిధంగా స్థానికంగా నివసిస్తున్న ఇక్కడి కాలనీ వాసులు సైతం ఈ దారి వలన తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ దారి కొరకు గతంలో ఆయా అధికారులకు విజ్ఞప్తి చేసిన ఎలాంటి చర్యలు తీసుకోలేదని కాలనీ వాసులు ఆవేదన చెందుతున్నారు.ప్రతిసారి వర్షం రావడంతో నిత్యం దారి జలమయం అవుతుంది అని అదేవిధంగా దారిలో ఉన్న నీరు వలన విష జ్వరాలు మరియు విష సర్పాలు వస్తున్నాయి అని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు కోరారు.