అభివృద్ధిపేరిట విధ్వంసాన్ని వ్యతిరేకించండి
శ్రీకాకుళం, జూన్ 25 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి పేరుతో తెస్తున్న విధ్వంసకర పరిశ్రమలను వ్యతిరేకించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం, జిల్లా ప్రధాన కార్యదర్శి వి.మాధవరావు పిలుపునిచ్చారు. విదేశాల్లో నిషేధించిన రసాయన, అణువిద్యుత్, థóర్మల్, బల్క్డ్రగ్స్ను మన పాలకులు స్వాగతిస్తున్నారని దేశ సహజ సంపదను కరుచౌకగా కొల్లగొట్టడానికి బహుళ జాతీ సంస్థలకు అప్పగిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రపంచ వ్యాప్తంగా కార్బన్ ఉప్పత్తి పెరగడం వలన వాతావరణంలో అనేక మార్పులు వస్తున్నాయని ఇవి మానవ జీవన మనుగడకే ప్రమాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడి దారి దేశాల్లో 2020 నాటికి థర్మల్ అణువిద్యుత్ కేంద్రాలు మూసివేస్తామని ప్రకటిస్తుంటే మనదేశంలో ఇప్పుడు ప్రారంభించడం విధ్వంసకరం కాదా అంటూ ప్రశ్నించారు. ఉత్తరాంధ్రలో విధ్వంసకర అభివృద్ధిని వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమాలు పెల్లుబికితే వాటిని సాయూదా బలగాలతో అనచివేయడానికి పునుకుంటూ ప్రజల జీవించే హక్కును కాలరాస్తున్నారని మత్య్సకారులు, రైతులు పర్యావరణ ప్రేమికులను జైలు పాలు చేస్తున్నారని తూర్పారబెట్టారు. పాలకులు సృష్టిస్తున్న విధ్వంసాన్ని వ్యతిరేకిస్తూ విశాఖ నగరంలో బహిరంగ సభ ర్యాలీలను నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు.